Home అంతర్జాతీయ ఒక్క పెగ్గు తాగినా ఆరు రకాల క్యాన్సర్లు.. బాంబ్ పేల్చిన శాస్త్రవేత్తలు -VRM MEDIA

ఒక్క పెగ్గు తాగినా ఆరు రకాల క్యాన్సర్లు.. బాంబ్ పేల్చిన శాస్త్రవేత్తలు -VRM MEDIA

by VRM Media
0 comments
ఆల్కహాల్ తో క్యాన్సర్ ముప్పు.. మద్యంపై హెచ్చరిక ఉండాలని అమెరికా వైద్యుల సూచన


మద్యం తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందన్న విషయం అందరికీ తెలుసు. మద్యం ఆరోగ్యానికి హానికరమనే ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లేందుకు వివిధ మాధ్యమాలను వినియోగిస్తున్నారు. అయితే ఇప్పటికి ఎంతోమంది మద్యం తాగుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ మద్దతునే అమెరికాకు చెందిన ప్రముఖ సర్జన్ కీలక విషయాలను బహిర్గతం చేశారు. మద్యం తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్పారు. మద్యం బాటిల్లపై హెచ్చరికలతో కూడిన లేబుళ్లు వేసి ప్రజలకు అవగాహన కల్పించాలని అమెరికా సర్జన్ జనరల్ వివేక మూర్తి. తాజాగా ఆయన చేసిన ఈ సూచనలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మద్యం తాగడం వల్లే కాకుండా నిత్యం వంటకాల్లో వినియోగించే ఆయిల్ వంటి కొన్ని రకాల విత్తన నూనెల కారణంగా పెద్ద పేగు క్యాన్సర్లు కూడా పెరుగుతున్నట్లు అమెరికాలోని మరో అధ్యయనం సూచించింది. అమెరికాలో ఆల్కహాల్ వల్ల దాదాపు లక్షమంది క్యాన్సర్ బారిన పడుతుండగా వీరులో 20,000 మంది ప్రాణాలను కోల్పోతున్నట్లు గుర్తించారు.

సర్జన్ జనరల్ వివేక్ మూర్తి స్థాయి పొగాకు, ఊబకాయం తర్వాత క్యాన్సర్‌కు మూడో అతిపెద్ద కారణంగా ఆల్కహాల్ ఉన్నట్లు వివరించారు. మద్యం తాగడం వల్ల రొమ్ము, కాలేయం, పెద్దపేగు, అన్న వాహిక, గొంతు సహా ఏడు రకాల శాస్త్రీయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ ప్రమాదాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఆయన వక్కాణించారు. ముఖ్యంగా మద్యం ఉత్పత్తులపై క్యాన్సర్ ప్రమాదాన్ని సూచించేలా నూతనంగా రూపొందించిన ఆరోగ్య హెచ్చరిక తప్పనిసరి తప్పనిసరి సర్జన్ జనరల్ అమెరికా కాంగ్రెస్‌ను కోరింది. పొగాకు వల్ల క్యాన్సర్ వస్తుందని 91 శాతం మంది అమెరికన్లు గుర్తిస్తుండగా, 50% మంది మాత్రమే ఆల్కహాల్ ను క్యాన్సర్ కారకంగా గుర్తిస్తున్నట్లు తెలియజేసింది. కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పించాలని సర్జన్ జనరల్ కోరింది. దీన్ని ఆల్కహాల్ బేవరేజెస్ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఐర్లాండ్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఇప్పటికే ఆల్కహాల్ ఉత్పత్తులపై క్యాన్సర్ హెచ్చరికలను తప్పనిసరి చేశాయి.

వంట నూనెలతోనూ క్యాన్సర్ ప్రమాదం

మరోవైపు వంట నూనెలతోనూ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందన్న అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇళ్లల్లో, రెస్టారెంట్లలో వాడే సన్‌ఫ్లవర్ ఆయిల్, ద్రాక్ష గింజల నూనె, కొనోల, మొక్కజొన్న నూనెలతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. పెద్ద పేగు క్యాన్సర్ ముఖ్యంగా యువకుల్లో ఈ తరహా క్యాన్సర్ పెరుగుదలకు ఈ వంట నూనెలు కారణమవుతున్నాయి. ఈ అధ్యాయంలో భాగంగా 30 నుంచి 85 ఏళ్ల మధ్య వయసు ఉన్న 80 మంది పెద్ద పేగు క్యాన్సర్ రోగుల కణితులను పరిశీలించారు. వారి కనుతుల్లో చాలా ఎక్కువ స్థాయిలో బయో యాక్టివ్ లిపిడ్లు ఉన్నాయి. విత్తనాల నుంచి వచ్చే నూనెలో వాడకం వల్ల బయో యాక్టివ్ లిపిడ్లు అధికంగా పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ వంట నూనెలు వినియోగించడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,809 Views

You may also like

Leave a Comment