VRM తెలియపత్రిక అయినవిల్లి భద్రం ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య గారి ప్రత్యేక ఆహ్వానం మేరకు, ప్రముఖ ధార్మిక సేవాకర్త , శ్రీ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు BJP నాయకులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాసరావు గారు ఉప ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించి,పాండురంగ స్వామి విగ్రహాన్ని బహుకరిoచి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు సమాజానికి అందిస్తున్న విశేష ధార్మిక, ఆధ్యాత్మిక సేవలను కొనియాడిన శ్రీ మౌర్య గారు, వారి సేవా నిరతిని ప్రత్యేకంగా అభినందించారు.”
