VRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రం
జి.ఎస్.ఎల్ సంస్థల అధినేత డాక్టర్ గన్నిభాస్కర రావు ఆధ్వర్యంలో గుర్రపు పందాలు, ఎడ్ల బండి పోటీలు..
తెలుగు సంస్కృతి సంప్రదాయాల్లో ఎడ్లబండ్ల పోటీలకు ఎంతో ప్రాధాన్యత ఉందని అలాంటి సంప్రదాయాలను కాపాడేందుకు GSL అధినేత గన్ని భాస్కర రావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ్ల పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉందన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు…రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు.
👉 రంగంపేట మండలం వడిశలేరు గ్రామం నందు స్వర్గీయ గన్ని సత్యనారాయణ మూర్తి జ్ఞాపకార్థం జి.ఎస్.ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు గారి ఆధ్వర్యంలో 6వ వార్షిక రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడుతూ డాక్టర్ గన్ని భాస్కర రావు గారు ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం రాష్ట్రస్థాయి ఎడ్ల బండి పోటీలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని…,ఈ సంవత్సరం ఎడ్ల పండ్లతో పాటు గుర్రపు పందాలు, రాష్ట్రస్థాయి ఎడ్ల బండి పోటీలలు కూడా అంతే వైభవంగా నిర్వహిస్తూ తెలుగు సంస్కృతి,సంప్రదాయాలకు ప్రాణం పోస్తున్న వ్యక్తి గన్ని భాస్కరరావు గారని ఈ సందర్భంగా తెలియజేసారు… ఈ పోటీలలో పాల్గొనడానికి వచ్చిన వారికి అభినందనలు తెలియజేసారు…
ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
