VRM MEDIA ఖమ్మం ఇంచార్జ్ కుంభం రవికుమార్


Federation of Legal Professionals Committee తరపున తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దిలీప్ తాళ్లూరి ఈ రోజు 29-12-2025 నాడు హైకోర్టు ప్రాంగణంలోని తెలంగాణ బార్ కౌన్సిల్ కార్యాలయంలో తన నామినేషన్ను అధికారికంగా దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కోర్టు మాజీ అధ్యక్షుడు, కార్యదర్శి గొల్లపూడి రామారావు, FLP వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి శ్రీనివాస్ రావు, FLP రాష్ట్ర కన్వీనర్ వేముల నవీన్, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ప్రతినిధి ఇమ్రాన్, మండా శ్రీనివాస్ రావు, నేరెళ్ల శ్రీనివాస్, వెక్కిరాల రాంబాబు, కల్లూరి శరత్ బాబు, పాలడుగు వెంకటేశ్వర్లు, సరికొండ శ్రీనాథ్, వేముల రవి, నవీద్ భాష, విసి ఇబ్రహీం, ఎండి కరీం, అమని గంటి రామారావు, తెల్లాకుల రమేష్, అద్దంకి మధు, ఏర్పుల ప్రవీణ్, కుంభం రవికుమార్, ఎస్కే మల్సూర్, మంద సురేష్ అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాదులు, యువ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని దిలీప్ తాళ్లూరికి తమ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన దిలీప్ తాళ్లూరి, న్యాయవాదుల సంక్షేమం, 41A c rpc/35(3)bnss pai అసెంబ్లీ మరియు పార్లిమెంట్ లో తను చేసిన కృషిని, వృత్తి భద్రత, ఆరోగ్య బీమా, న్యాయవాదులపై జరుగుతున్న దాడుల నివారణకు కఠిన చట్టం కోసం తన ప్రయత్నం తీసుకురావడం వంటి అంశాలపై తన కట్టుబాటును మరోసారి స్పష్టం చేశారు. న్యాయవాదుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు.