Home Uncategorized డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

by VRM Media
0 comments

VRM మీడియా న్యూస్
సత్తుపల్లి ప్రతినిధి
ఖమ్మం జిల్లా
14-04-2026 (మంగళవారం)

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

సత్తుపల్లి పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద మెయిన్ రోడ్డుపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు పాల్గొని అంబేద్కర్ గారి సేవలను స్మరించుకున్నారు.

అనంతరం వారు అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక సమానత్వం, న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం కమలపాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదే చెన్నారావు, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహరావు, పట్టణ మరియు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.

కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

2,808 Views

You may also like

Leave a Comment