*VRM మీడియా అయినవిల్లి భద్రం రాజానగరంలో “పల్లె పండుగ 2.0 – ప్రజా దర్బార్”**ప్రజల ముంగిటకే పాలన అందించడమే ధ్యేయం – ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ**రాజానగరం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు రాజానగరం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో “పల్లె పండుగ 2.0 – ప్రజా దర్బార్” (జనవాణి) కార్యక్రమం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయానికి విచ్చేసిన వందలాది మంది ప్రజలతో నేరుగా ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.**కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన మహిళలు, వృద్ధులు, యువకులు మరియు రైతులు ఎమ్మెల్యే ని కలిసి తమ సమస్యలను తెలియజేసారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రతి ఒక్కరినీ సాదరంగా ఆహ్వానిస్తూ, వారు సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు.* *ఈ “ప్రజా దర్బార్” వేదికగా విద్య, వైద్యం, భూ వివాదాలు, భూమి హెచ్చుతగ్గులు, సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు, రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు మరియు సాగునీటి సమస్యలపై ప్రజలు వినతులు సమర్పించారు. ఉపాధి హామీ (NREGS) పనులకు సంబంధించి వచ్చిన పలు అర్జీలను ఎమ్మెల్యే పరిశీలించారు.* *అర్జీలపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెంటనే స్పందిస్తూ, వివిధ శాఖల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. “ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం వహించకూడదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి. పారదర్శకమైన పాలన అందించడమే మన లక్ష్యం” అని అధికారులకు స్పష్టం చేశారు.**ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. “ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని పరిష్కరించడం ద్వారా సుపరిపాలన అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ‘మన ఊరు – మన ఎమ్మెల్యే – మన పల్లె బాట’ నినాదంతో ప్రతి అడుగు ప్రజల ప్రగతి కోసం వేస్తున్నాం. పారదర్శకమైన పాలన అందించేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలి” అని పేర్కొన్నారు.*ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి నాయకులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

