Home Uncategorized జయకేతనం467 మార్కులతో ప్రతిభబోనకల్ విద్యార్థి విజయగాథ

జయకేతనం467 మార్కులతో ప్రతిభబోనకల్ విద్యార్థి విజయగాథ

by VRM Media
0 comments

Vrm media ప్రతినిధి బోనకల్, ఏప్రిల్ 16:

ఖమ్మం జిల్లా
బోనకల్‌కు చెందిన కొణతాలపల్లి పార్ధ సాయి అన్వేష్ సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలలో మెరుగైన ప్రతిభ కనబర్చాడు. ఖమ్మంలోని హార్వెస్ట్ స్కూల్‌లో చదువుతున్న అతడు 500 మార్కులకు గాను 467 మార్కులు సాధించాడు.
అన్వేష్ తల్లిదండ్రులు కొణతాలపల్లి నాగేశ్వరరావు, కృష్ణవేణి. ఫలితాల అనంతరం ఆనందం వ్యక్తం చేసిన అన్వేష్, మంచి ఫలితాలు సాధించడంలో స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రుల సహకారం ఎంతో కీలకమని తెలిపాడు.
విద్యార్థి సాధించిన విజయానికి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తోటి మిత్రులు, బంధువులతో కలిసి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.

2,818 Views

You may also like

Leave a Comment