vrm media ప్రతినిధి

అంబేద్కర్ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ఘన సత్కారం
దళిత రత్న అవార్డు సేవకు కొత్త బాధ్యత: కనకపుడి వీరస్వామి
అంబేద్కర్ ఆశయాలే నా దారి
బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం కొనసాగుతుంది
సేవలో మరింత దూకుడు చూపిస్తా
నాపై నమ్మకానికి కృతజ్ఞతలు
ఏప్రిల్ 16 గురువారం
హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన నా కు ప్రతిష్టాత్మక “దళిత రత్న” అవార్డు ప్రధానం చేశారు . హైదరాబాదులోని రవీంద్ర భారతి జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వ ఉత్సవాల కమిటీ చైర్మన్ సుదర్శన్ కో కన్వీనర్ శివకుమార్ అధ్యక్షతన జరిగిన అవార్డుల ప్రధాన చౌక కార్యక్రమానికి కమిటీ సభ్యులు తెలంగాణ మాదిగ హక్కుల వ్యవస్థాపకులు మాదిగ తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంహెచ్డీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ పాల్గొని అవార్డు అందజేశారు. సమాజంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి అంకితభావంతో సేవలందిస్తున్నందుకు కనకపుడి వీరస్వామి ఈ అవార్డు కు ఎంపిక చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాలకు అనగా నిలిస్తే సేవా కార్యక్రమం కొనసాగిస్తున్న కనకపుడి వీరస్వామి సేవలో అభినందనీయమన్నారు భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు
కనకపుడి వీరస్వామి అనంతరం తనపై ఇచ్చిన నమ్మకాన్ని కి కృతజ్ఞతలు తెలిపారు ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం మరింత కృషి చేస్తానని స్పష్టం చేశారు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని తెలిపారు