Home ఎంటర్‌టెయిన్మెంట్ మహేష్ బాబు: అబ్బా ఏమున్నాడో.. పోటాపోటీ కామెంట్స్ – VRM MEDIA

మహేష్ బాబు: అబ్బా ఏమున్నాడో.. పోటాపోటీ కామెంట్స్ – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo



-ఈ లెక్కన వారణాసికి బ్రేక్ నిజమే
-ఎయిర్ పోర్ట్ లో మహేష్
-లుక్ వైరల్

అబ్బా ఏమున్నాడో.. అని హీరో కట్ ని చూసి కొంత అమ్మాయిలు మాట్లాడుతుంటే సినిమా కదా అంతే మాట్లాడుకుంటారులే అనుకుంటాం. అబ్బాయిలు కూడా అబ్బా ఏమున్నాడో అని అనుకుంటారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు(మహేష్ బాబు)విషయంలో ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా పైన చెప్పుకున్న మాటలు ఎక్కువగా వినపడుతుంటాయనేది నానుడి. రీసెంట్ గా ఈ విషయం మరోసారి రుజువయ్యింది.

మహేష్ బాబు ఎక్స్ క్లూజివ్ గా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చాడు. కాప్ అండ్ స్పెక్ట్స్ ధరించి స్టైలిస్ట్ గా నడుచుకుంటూ వస్తుంటే బాబు ల్యాండ్ అయ్యాడంటే సోషల్ మీడియా రికార్డు వ్యూస్ అన్ని బాబు వెంటే అనేలా అతని పిక్ ఉంది. ఇక ఎవరి అదృష్టమో గాని అలాగే నడుచుకుంటూ ఒకరి వైపు చూసి స్మైల్ తో పలకరించాడు. మరి ఆ ప్రాణి ఎవరో గాని తన జన్మ ధన్యమైనట్టుగా మురిసిపోవడం ఖాయం.

ఇది కూడా చదవండి: People Media Factory: అప్పుడే అయిపోయిందనుకోకు, ఇప్పుడే మొదలైంది.. 2027 కి పక్కా ప్లానింగ్

కొన్ని రోజులుగా ఫిలిం సర్కిల్స్ తో పాటు, సోషల్ మీడియాలో మండే ఎండల దృష్ట్యా వారణాసి(వారణాసి)కి బ్రేక్ అప్ ఇస్తున్నారనే న్యూస్ వినపడుతుంది. ఈ ఇప్పుడు మహేష్ ఎయిర్ పోర్ట్ పిక్ అందుకు బలాన్ని ఇస్తుందని చెప్పవచ్చు . వరల్డ్ సినిమా రికార్డులే లక్ష్యంగా వారణాసి రూపొందించబడింది. రాజమౌళి(ss Rajamouli)మహేష్ ల ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ కూడా. ఇక ఎయిర్ పోర్ట్ లో మహేష్ వెంట నమ్రత కూడా ఉంది. ఇక ఫ్యాన్స్ అయితే సమ్మర్ కి ఏ దేశం వెళ్తున్నాడో అని తమ ఊహకి అనిపించిన కంత్రీ పేరుతో పోటాపోటీ కామెంట్స్ తో సోషల్ మీడియాకి జోష్ ని తెస్తున్నారు.

2,801 Views

You may also like

Leave a Comment