రాజంపేట టిడిపి ఇన్చార్జ్ గౌరవనీయులు శ్రీ చమతి జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో రాజంపేటలో జరుగుతున్న మెగా జాబ్ మేళాకు విశేష స్పందన, రాజంపేట నియోజకవర్గం అన్ని మండలాల నిరుద్యోగులు విద్యార్థులు వేలాదిమంది ఈ జాబు మేళాలో పాల్గొని వాళ్ల విద్యార్హత ను బట్టి తగు కంపెనీలకు ఇంటర్వ్యూకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అన్ని మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండలం నుంచి పార్లమెంటు ఉపాధ్యక్షుడు నాగ మునిరెడ్డి సిద్ధవటం మండల టిడిపి అధ్యక్షుడు రాజశేఖర్ యాదవ్ ఎక్స్ సర్పంచ్ ఓబులయ్య ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు శ్రీనివాసులు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.