Home Uncategorized రాజంపేట జనసేన బలోపేతానికి అతికారి కృష్ణే సరైన నాయకుడు

రాజంపేట జనసేన బలోపేతానికి అతికారి కృష్ణే సరైన నాయకుడు

by VRM Media
0 comments

యువ నాయకుడు డేరంగుల శ్రీకాంత్

సిద్ధవటం: VRM న్యూస్ మే 17

రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి మరియు కూటమి పార్టీల నాయకులను, కార్యకర్తలను సమన్వయ పరచడానికి అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం ఉన్న దమ్మున్న నాయకుడు అతికారి కృష్ణ మాత్రమేనని సిద్ధవటం మండలం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శ్రీలేఖ భర్త, జనసేన పార్టీ యువ నాయకుడు డేరంగుల శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఆదివారం మండల పరిధిలోని మాధవరం-1 గ్రామంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డేరంగుల శ్రీకాంత్ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత దీటుగా ఎదుర్కొనగలిగే ధైర్యం, శక్తి ఒక్క అతికారి కృష్ణకే ఉన్నాయని కొనియాడారు. పొత్తు ధర్మాన్ని తప్పకుండా పాటిస్తూ, నియోజకవర్గంలో కూటమిలోని అన్ని వర్గాలను ఏకం చేయగల సమర్థుడు ఆయనేనని పేర్కొన్నారు. జనసేన పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న అతికారి కృష్ణ లాంటి బలమైన నాయకుడికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తగిన పార్టీ పదవులను కట్టబెట్టాలని ఆయన కోరారు.అలాంటి దమ్మున్న వ్యక్తికి పదవులు ఇస్తే మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తారని, నియోజకవర్గంలోని యువతను, సీనియర్లను సమన్వయం చేసుకుంటూ రాజంపేటను అభివృద్ధి పథంలో నడిపిస్తారనే దృఢమైన నమ్మకం ఇటు కార్యకర్తల్లోనూ, అటు ప్రజల్లోనూ బలంగా ఉందని శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డేరంగుల శ్రీకాంత్‌తో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

2,802 Views

You may also like

Leave a Comment