సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ మే 27
సిద్ధపటం చెంచులక్ష్మి కాలనీ యందు వైద్యురాలు పి రంగ లక్ష్మి గారి ఆదేశాల మేరకు సిద్దవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు గారు మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లక్ష్మీ నరసమ గారి ఆధ్వర్యంలో చెంచులక్ష్మి కాలనీ యందు పరిసరాల పరిశుభ్రత శారీరక శుభ్రత గురించి కాలనీ ప్రజలకు వివరించడం జరిగినది మీ కాలనీ వాసులు అందరూ మీ ఇంటి చుట్టుపక్కల మీ పరిసరాల చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనేక వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వాంతులు విరేచనాలు లాంటి వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చునని అక్కడి కాలనీ వాసులకు ఆరోగ్య బోధన చేయడం జరిగినది ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం మీ ఇంటిలోని నీటినంత పారద్రోసి తరువాత కొద్దిసేపు నీటి తొట్టెలు డ్రమ్ములు వాటర్ ట్యాంకులు ఇవన్నీ ఆరబెట్టి తర్వాత నీరు పట్టుకోవడం వల్ల ఈ దోమలనేవి అభివృద్ధి చెందకుండా ఉంటాయని అవి మీకు కుట్టకుండాఅక్కడి ప్రజలకు చెప్పడం జరిగినది మీ కాలనీ వాసులంతా పిల్లలు గానీ పెద్దలు గాని అందరూ శారీరకశుభ్రత చేతుల శుభ్రత తప్పకుండా పాటించాలని ప్రతి ఒక్కరూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ఉండాలని ఈగలు వాలిన ఆహారపదార్థాలు తీసుకోరాదని అలా చేయడం వల్ల వాంతులు విరేచనాలు కలుగుతాయని అక్కడి కాలనీవాసులకు చెప్పడం జరిగినది మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా మా వైద్య సిబ్బందికి తెలియజేయాలని మేము మీకు ఉచితంగా వైద్య సహాయం అందిస్తామని చెప్పడం జరిగినది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మౌలాలి ఎంఎల్ హెచ్పి లోకేశ్వరి హెల్త్ అసిస్టెంట్ వెంకటసుబ్బయ్య ఆరోగ్య కార్యకర్త శారద ఆశ కళావతి పాల్గొనడం జరిగినది

