అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని భారతదేశానికి తిరిగి వచ్చిన
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు, శ్రీమతి పద్మావతి దేవి గంగారత్నం దంపతులకు మంగళవారం మధురపూడి విమానాశ్రయం వద్ద అపూర్వమైన స్వాగతం లభించింది.
గత నెల 21వ తేదీన అమెరికా వెళ్లిన వారు పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని, భారతదేశానికి తిరిగి వచ్చారు.
మంగళవారం మధురపూడి ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ వద్దకు రంపచోడవరం, రాజానగరం, జగ్గంపేట నియోజకవర్గాల గ్రామాల నుంచి అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కంబాల శ్రీనివాసరావు దంపతులకు పూలమాలలు వేసి, దుశ్శాలువాలు కప్పి, గజమాలతో ఘనంగా సత్కరించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అనంతరం మధురపూడి నుంచి డీజే సాంగ్స్ తో, డప్పు వాయిద్యాలతో బూరుగుపూడి, కోరుకొండ మీదగా, గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వరకు కంబాల శ్రీనివాసరావు దంపతులను బైక్ లతో ర్యాలీగా జై కంబాల నినాదాలతో తీసుకువెళ్లారు.
అడుగడుగునా అభిమానులు నీరజనాలు పట్టారు. కోరుకొండ రామసేన కార్యాలయం వద్ద వందలాది మంది మహిళలు గుమ్మడికాయలతో హారతులు పట్టి దిష్టి తీశారు.
గోకవరం దేవిచౌక్ దుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ మహిళలు హరతులు పట్టి, దిష్టి తీశారు.
అక్కడ నుంచి తంటికొండ రోడ్డులోని సీఎండీ లే అవుట్ చేరుకున్న కంబాల శ్రీనివాసరావుకీ మహిళలు, పలు గ్రామాల ప్రజలు పుష్పగుచ్చాలతో అందించి, పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.
మధురపూడి నుంచి గోకవరం వరకు మార్గంలో ప్రతి గ్రామంలో అభిమానులు, కార్యకర్తలు, మహిళలు హరతులు పట్టి, పుష్పాలు జల్లుతూ స్వాగతం పలికారు.
We're a media company. We promise to tell you what's new in the parts of modern life that matter. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo. Sed consequat, leo eget bibendum sodales, augue velit.