VRM media అయినవిల్లి భద్రం
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ పరిశీలకులు శ్రీ బత్తుల బలరామకృష్ణ మరియు పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 3వ రోజు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ దిగ్విజయంగా సాగుతోంది..


ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక డెస్క్‌లు ఏర్పాటు చేసి, పార్టీ కోసం సేవ చేయాలనే తపనతో ముందుకు వచ్చిన జనసైనికులు, వీరమహిళల నుండి దరఖాస్తులను బత్తుల బలరామకృష్ణ స్వయంగా స్వీకరించారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో వచ్చిన స్పందన జనసేనపై ప్రజల్లో, కార్యకర్తల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనం అని శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ అన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయి నుంచి సమర్థవంతమైన నాయకత్వాన్ని పారదర్శకంగా వెలికితీసి, నిబద్ధతతో పనిచేసే వారికి బాధ్యతలు అప్పగించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశ్యమని శ్రీ బత్తుల బలరామకృష్ణ తెలిపారు.