Home Uncategorized ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం

ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం

by VRM Media
0 comments

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల ఆర్ధిక సహాయం

విద్యా రిజర్వేషన్ కార్పొరేట్ విద్యా సంస్థలలో 25 శాతం ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలి

ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ ల సబ్ ప్లాన్ నిధులు వెంటనే మంజూరు చేయాలి

జాతీయ ఉపాధ్యక్షులు లంక వెంకటేశ్వర్లు (ఎల్.వి.ఆర్) మాదిగ

ఖమ్మం,02 జూలై :

ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా ముఖ్య కార్య కర్తల సమావేశమునకు, ముఖ్య అతిథిగా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాశి మోహన్ మాదిగ మరియు జాతీయ ఉపాధ్యక్షులు లంక వెంకటేశ్వర్లు (ఎల్.వి.ఆర్) మాదిగ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ,
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల ఆర్ధిక సాయం తక్షణమే అందించి, విద్యా రిజర్వేషన్ కార్పొరేట్ విద్యా సంస్థలలో 25 శాతం ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేసి, గత ప్రభుత్వం దళిత బందు సగం డబ్బులిచ్చి, సగం డబ్బులు ఇవ్వలేదు వాటిని వెంటనే మంజూరు చేయాలి అంటూ,
ఎస్సీ,ఎస్టీ, బీ.సీ ముస్లిం మైనారిటీ ల సబ్ ప్లాన్ నిధులు వెంటనే మంజూరు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా సమాధులు లేని గ్రామాలలో సమాధులకు స్థలం వెంటనే కేటాయించాలి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షులు (ఎం.ఈ.ఎఫ్) కుక్కల శ్రీనివాస్ మరియు మహిళ మండలి జిల్లా అధ్యక్షురాలు మెల్లచెరువు నాగమణి మరియు జిల్లా అధ్యక్షులు హెచ్చు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులకు వేతనం పెంచాలని మాట్లాడటం జరిగింది.
ఈ కార్యక్రమములో కుక్కల రాములు, పొట్టపింజర వెంకట రత్నం,బిమేకల వెంకటేశ్వర్లు, గంధం జగజీవన్ రావు, విద్యార్ది సంఘం జిల్లా అధ్యక్షులు కరిస ఉపేందర్, ముదిగొండ మండల అధ్యక్షులు కొత్తపల్లి నరసింహ, కొత్తగూడెం జిల్లా ఇంచార్జీ లంక బాబురావు, చింతకాని మండల అధ్యక్షులు సింగారపు బాబురావు, జిల్లా నాయకులు కంభంపాటి రాజా రత్నం, చిరమర్తి దుర్గా ప్రసాద్ రిటైర్డ్ ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్షులు శనగల వీరస్వామి రఘునాథ పాలెం మండల అధ్యక్షులు రామారావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

2,802 Views

You may also like

Leave a Comment