Home Uncategorized పెన్నా నది కోత నివారణకు కరకట్ట నిర్మాణం చేపట్టాలి– ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసిన రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి

పెన్నా నది కోత నివారణకు కరకట్ట నిర్మాణం చేపట్టాలి– ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసిన రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ మే 22

రాజంపేట నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా రాజంపేట ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించిన ఇంచార్జిల సమావేశంలో రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి సిద్ధవటం మండలంలోని కీలక సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా సిద్ధవటం మండలంలోని టక్కోలు, లింగంపల్లి, కడపాయపల్లి గ్రామాలు పెన్నా నది ఒడ్డున ఉండటంతో ప్రతి ఏడాది వర్షాకాలంలో నది ప్రవాహం ఉధృతంగా మారి విలువైన పంట భూములు కోతకు గురవుతున్నాయని తెలిపారు. దశాబ్దాలుగా రైతులు సాగు చేస్తున్న సారవంతమైన భూములు నదిలో కలిసిపోతుండటంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా పెన్నా నది ఒడ్డున కరకట్ట లేదా ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టాలని మంత్రి గారిని నాగముని రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతుల భూములను కాపాడటంతో పాటు గ్రామాలను వరద ముప్పు నుంచి రక్షించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమస్యపై మంత్రి నిమ్మల రామానాయుడు గారు సానుకూలంగా స్పందించి అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాగముని రెడ్డి తెలిపారు.

2,809 Views

You may also like

Leave a Comment