Home Uncategorized *నిరుద్యోగులకు అండగా చమర్తి జగన్ మోహన్ రాజు జాబ్ మేళా

*నిరుద్యోగులకు అండగా చమర్తి జగన్ మోహన్ రాజు జాబ్ మేళా

by VRM Media
0 comments

రాజంపేటVRM న్యూస్ మే 18

రాజంపేట డిగ్రీ కాలేజీలో ఆదివారం నిర్వహించిన జాబ్ మేళాకు భారీగా నిరుద్యోగ యువత హాజరైంది. రాజంపేట టీడీపీ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 1200 మంది యువత పాల్గొనగా, వివిధ కంపెనీలలో 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట ప్రాంత యువత గల్ఫ్ బాట పట్టాల్సిన పరిస్థితులు తగ్గించి, స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. త్వరలో మరిన్ని జాబ్ మేళాలు, ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఇటీవల నిర్వహించిన “కంటి వెలుగు” కార్యక్రమం తర్వాత జాబ్ మేళా కూడా విజయవంతం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పార్లిమెంట్ ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి, మండల అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్, x సర్పంచ్ ఓబుళయ్య, యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

2,802 Views

You may also like

Leave a Comment