VRM media అయినావిల్లి భద్రం
పాటంశెట్టి సూర్యచంద్ర
ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి
శ్రీ నారా లోకేష్ జగ్గంపేట పర్యటన సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుచున్న మట్టి, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాపై మరియు నియోజకవర్గ ప్రజా సమస్యల మీద స్పందించుట కోసం బూరుగుపూడి గ్రామంలో మా ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశం జరగకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మా ఇంటి పైకి పంపించి నామీద, నా శ్రేయోభిలాషుల మీద భౌతిక దాడులు చేసి దౌర్జన్యానికి పాల్పడడం ప్రశ్నించే గొంతుని అణచి వేయడం మీకు న్యాయమా అని జ్యోతుల నెహ్రూని సూర్యచంద్ర ప్రశ్నించారు. మా ఇంటి మీదకి వచ్చి మా మీదకు దాడికి తెగబడి మాపై దౌర్జన్యం చేయడమే కాకుండా, తెలుగుదేశం పార్టీ నాయకులు వారి చొక్కాలు వారే చింపుకొని మాపై తప్పుడు కేసులు బనాయించడానికి ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను కూలదోయడమేనని సూర్యచంద్ర ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతి చేయకపోతే నియోజకవర్గంలో కోట్లాది రూపాయల మట్టి గ్రావెల్ ఇసుక అక్రమ తోలకాలు ఎవరు చేస్తున్నారో నిరూపించాలి కదా అన్నారు. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న మీరు అదే రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యాన్ని హరించే హక్కు మీకు ఎక్కడిదిని సూర్యచంద్ర ప్రశ్నించారు. పోలీసు వారు సమగ్ర విచారణ చేసి మా ఇంటికి వచ్చి మా పై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూర్యచంద్ర కోరారు
