సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ ఈశ్వర్ మే 22
వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే సీజన్ వ్యాధులు దరిదాపుల్లోకి రావని వైద్యాధికారి డాక్టర్ శ్రీవిద్య తెలిపారు మండలంలోని ముమ్మిడిగుంటపల్లి గ్రామంలో శుక్రవారం డ్రై డే ఫ్రైడే సందర్భంగా వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు శుక్రవారం మాట్లాడుతూ మాధవరం పీహెచ్ఏ పరిధిలోని ముమ్మడి గుంటపల్లి లో డ్రై డే ఫ్రైడే సందర్భంగా ప్రతి ఒక్కరూ శుభ్రత పరిశుభ్రత పాటించాలని దోమలు కుట్టకుండా రాత్రి వేళలో ప్రతి ఒక్కరూ దోమతెరలు ప్రతి ఒక్కరూ వాడాలని గృహాల చుట్టూ మురికి నీరు లేకుండా చూడాలని వారానికి ఒకరోజు మీ గృహాల్లో ఉన్న నీటిని పూర్తిగా తొలగించి కొత్త నీటిని నింపాలని శుభ్రత పరిశుభ్రత పాటిస్తే సీజన్ వ్యాధులు దరిదాపుల్లెకి రావని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రమణయ్య, జ్యోతికల, ఆరోగ్య కార్యకర్తలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు

