

వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు
ప్రత్తిపాడు Vrm.media న్యూస్ 24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్ 8:–
జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవరం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాద సంఘటన తెలుసుకుని ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఏలేశ్వరం పట్టణానికి చెందిన కాకడా రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 50 లక్షల రూపాయలు, ఒక ఎకరం పొలం, ఇంటికో ఒక ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకాడా రాజు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేవారని వారికి ఆరుగురు పిల్లలు ఉన్నారని వారి కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోయారని వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని గిరిబాబు అన్నారు. కాకాడ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ఏ కష్టమొచ్చిన అండగా నిలుస్తానని తెలిపారు. ఆయన వెంట పార్టీ నాయకులు సామంతుల కుమార్, కోరాడ ప్రసాద్, గుడాల వెంకటరత్నం,పినిశెట్టి ప్రకాష్, శేరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.