Home ఎంటర్‌టెయిన్మెంట్ టాలీవుడ్ ఫస్ట్ వాలీబాల్ స్పోర్ట్స్ డ్రామా ‘వాలీ’.. పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ క్రిష్! – VRM MEDIA

టాలీవుడ్ ఫస్ట్ వాలీబాల్ స్పోర్ట్స్ డ్రామా ‘వాలీ’.. పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ క్రిష్! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


టాలీవుడ్‌లో మొట్టమొదటి వాలీబాల్ నేపథ్యంలోని స్పోర్ట్స్ డ్రామా ‘వాలీ’ (VOLLEY) తన టైటిల్‌ను ఆసక్తికరమైన మోషన్ పోస్టర్ ద్వారా అధికారికంగా విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ జగర్లమూడి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా విడుదల చేశారు. ఈ పోస్టర్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.

జి విక్రమ్ రెడ్డి సమర్పణలో ఫైర్‌వాటర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రం దిలీప్ కె. మనుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. తీరప్రాంత గ్రామీణ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా, ఇద్దరు అన్నదమ్ముల జీవితాలను కేంద్రీకరించి, వాలీబాల్ క్రీడలోని తీవ్ర పోటీ, భావోద్వేగాలు, మానవ సంబంధాలను ప్రతిబింబిస్తుంది.

ఈ చిత్రంతో రోనిత్ జీఆర్‌జీ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇదే చిత్రంతో పరిచయం కాబోతున్న నిపుణ్ సత్య, ఓ కీలక పాత్రను చేస్తున్నాడు. అభిగ్న్య వుత్తలూరు హీరోయిన్‌గా నటిస్తోంది. రవి వర్మ, కల్పలత, వడ్లమాని శ్రీనివాస్, లక్ష్మణ్ మీశాల, కిరణ్ వరణాసి, రమణ భార్గవ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ జి రోహన్ రెడ్డి నిర్మిస్తుండగా, శ్రీనివాస్ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు. కథ, స్క్రీన్‌ప్లేలను దిలీప్ కె. మనుకొండ, పవన్ కె. విప్పర్తి సంయుక్తంగా రచించారు.

రానోవా స్టూడియోస్ సంగీతాన్ని సమకూర్చుతున్న అరుణ సినిమాటోగ్రాఫర్ గాన్ విజేకే , ఎడిటర్ గా రవితేజ గిరిజాల నటిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉప్పాడ మరియు పరిసర ప్రాంతాలలో అందమైన స్థానాల్లో చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

టైటిల్ రివీల్‌తో పాటు మోషన్ పోస్టర్‌కు లభిస్తున్న మంచి స్పందనతో ‘వాలీ’ శక్తివంతమైన స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటుందని అంచనాలు పెరుగుతున్నాయి.

2,802 Views

You may also like

Leave a Comment