ముఖ్య అతిధిగా పాల్గొన్న కంబాల

మోటర్ మెకానికల్ వర్కర్స్ యూనియన్ సంఘానికి లక్ష రూపాయలు విరాళం
గోకవరం మే01: కోరుకొండ గ్రామంలో దేవి వెంకట మణి సాయి మోటార్ మెకానికల్ వర్కర్స్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మేడే కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలిత ఆయనకు కార్మికులు ఘన స్వాగతం పలికారు. కాపవరం జంక్షన్ ప్రధాన రహదారి వద్ద ఉన్న దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం నుంచి జంబూపట్నంలోని దేవి వెంకట మణి సాయి మోటార్ యూనియన్ సంఘం కార్యాలయం వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం వద్ద జెండాను కంబాల శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావుని కార్మిక సంఘం నాయకులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులు దేశానికి వెన్ను ముక్కలాంటి వారని, వారి సేవలను కొనియాడారు. కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. అందరూ కలిసికట్టుగా ఉంటూ కుటుంబంలో ఎవరికి ఆపద వచ్చిన తోడుగా నిలవాలని అన్నారు. మీలో ఒకరిగా మీ మనిషిగా మీ అభివృద్ధికి సహకారం అందిస్తానన్నారు. కుల,మతాలకు అతితంగా మూడు నియోజకవర్గాల్లో సేవలు అందిస్తున్నానని అన్నారు. కార్మికుల సంక్షేమానికి తనవంతుగా లక్ష రూపాయల విరాళాన్ని యూనియన్ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు బత్తుల నానాజీ, కంబాల యువసేన అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, రాజానగరం మండల బీజేపీ అధ్యక్షులు ఆళ్ల శివ నాగ రాజు, కరిబండి వెంకటేశ్వరరావు, నాగ రమేష్, రాయపాటి సత్యనారాయణ, మండే గౌతమ్, నెల్లి శ్రీను, తుమ్మల బుజ్జి, పదిలం చక్రరావు, కాకర దుర్గారావు, యూనియన్ సంఘం నాయకులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.