Home Uncategorized పబ్లిక్ అలర్ట్ – పెద్ద పులి సంచారం 🚨🚨

పబ్లిక్ అలర్ట్ – పెద్ద పులి సంచారం 🚨🚨

by VRM Media
0 comments

VRM మీడియా అయినవిల్లి భద్రం

కోరుకొండ పాండవుల మెట్ట దగ్గర పెద్ద పులి సంచారం

*క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ *

కోరుకొండ, సీతానగరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

కోరుకొండ మండలం కాపవరం గ్రామం పాండవుల మెట్ట వద్ద ఈ రోజు ఉదయం పెద్దపులి కదలికలు గుర్తించిన నేపథ్యంలో రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గురువారం పులి సంచరిస్తున్నట్లుగా భావిస్తున్న ప్రాంతాలను పరిశీలించిన ఆయన, అటవీశాఖ అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ.. ప్రజల రక్షణే ప్రథమ ప్రాధాన్యతని, పులిని బంధించేందుకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. బోన్లు ఏర్పాటు చేయడం, ట్రాప్ కెమెరాల ద్వారా పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పులి సంచారం ఉన్నట్లు గుర్తించిన కీలక ప్రాంతాల్లో తక్షణమే అధునాతన బోన్లు, ఎరలను ఏర్పాటు చేయాలి. నైట్ విజన్ కెమెరాల ద్వారా పులి కదలికలను 24 గంటల పాటు నిశితంగా పర్యవేక్షించాలి. గ్రామాల్లో అటవీశాఖ సిబ్బందితో నిరంతరం గస్తీ (Patrolling) నిర్వహించి ప్రజల్లో ధైర్యం నింపాలి. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణమే స్పందించేలా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (QRT) అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసారు.

ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి:

కోరుకొండ మరియు సీతానగరం ప్రజలు మరియు రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ కోరారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లవద్దని, ఒంటరిగా బయట తిరగవద్దని సూచించారు. పశువుల సంరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పులి కదలికలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు లేదా స్థానిక నాయకులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. గత 3 రోజులుగా పులి ఏ విధమైన ఆహరం తీసుకోలేదని..ఈ రోజు ఆహారం కోసం వేటాడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేసారు.

ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం మరియు అటవీశాఖ యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచిందని, త్వరలోనే పులిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేసారు.

వీరితో పాటు అటవీ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

2,804 Views

You may also like

Leave a Comment