Home Uncategorized ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ సోళ్ల బొజ్జి రెడ్డి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒంగోలు కేంద్రం పరిసర ప్రాంతాలలోని గిరిజన గ్రామాలను సందర్శించారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ సోళ్ల బొజ్జి రెడ్డి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒంగోలు కేంద్రం పరిసర ప్రాంతాలలోని గిరిజన గ్రామాలను సందర్శించారు

by VRM Media
0 comments

VRM మీడియా అయినవిల్లి భద్రం
తేదీ: 23-04-2026

ప్రకాశం జిల్లా – ఒంగోలు:

.

ఒంగోలు మండల కేంద్రంలోని జయప్రకాశ్ నగర్‌లో గత కొన్ని సంవత్సరాలుగా సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే, అక్కడ రహదారి సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యను చైర్మన్ స్వయంగా పరిశీలించి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ త్వరలోనే రహదారి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం రంగాయపాలెం గ్రామానికి చెందిన ఒక మత్స్యకార రైతు 12-08-2025న బ్యాంకింగ్ హోమ్ కాలువలో పడిపోయి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి మూడు నెలలు గడిచినా, ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదు. ఈ విషయాన్ని చైర్మన్ దృష్టికి తీసుకురాగానే, ఆయన రీ-ఇన్వెస్టిగేషన్ చేసి, పోస్ట్‌మార్టం నివేదికను ఆసుపత్రి నుండి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి లభించే బీమా, పెన్షన్ వంటి సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి సూచించారు.

సింగరాయకొండ మండలంలోని మల్లిఖార్జున నగర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన చైర్మన్ గారు, విద్యార్థులతో ముచ్చటించారు.

ఉలవపాడు మండలం కారేడు గ్రామంలోని మర్రిచెట్టు యానాది కాలనీలో సమావేశం నిర్వహించి, స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని, ఇళ్ల మంజూరు జరగలేదని, ఆధార్ కార్డు అప్‌డేట్ కాలేదని తదితర సమస్యలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు అనేక దరఖాస్తులను చైర్మన్ కి అందజేశారు.

గ్రామాల పర్యటన అనంతరం, చైర్మన్ ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై సమీక్ష నిర్వహించారు.

సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమావేశం అనంతరం చైర్మన్ మార్కాపురంకు తిరిగి చేరుకున్నారు.

2,802 Views

You may also like

Leave a Comment