Home Uncategorized ప్రజా సమస్యలపై పోరాటాలను ఉదృతం చేయాలిపేద ప్రజలకి అండ ఎర్రజెండానే*_సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు పిలుపు

ప్రజా సమస్యలపై పోరాటాలను ఉదృతం చేయాలిపేద ప్రజలకి అండ ఎర్రజెండానే*_సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు పిలుపు

by VRM Media
0 comments

రఘు నాధ పాలెం మండలంలో సీపీఐ లో పలువురు చేరిక.

ఖమ్మం ప్రజా సమస్యలపై పోరాటాలను ఉదృతం చేయాలనీ పేద ప్రజలకి అండ ఎర్రజెండానే అన్ని సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు పిలుపునిచ్చారు.భారత కమ్యూనిస్ట్ పార్టీ(సీపీఐ)లోకి రఘునాధపాలెం మండలం కేసీఆర్ నగర్ కి చెందిన నాదెండ్ల.పుల్లయ్య, కుంచ.నాగరాజు,చిమ్మపూడి గ్రామానికి చెందిన గుండ్ల.అశోక్ లు స్థానిక గిరి ప్రసాద్ భవన్ జిల్లా కార్యాలయంలో సీపీఐలో చేరడం జరిగింది.వీరికి సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం.హేమంతరావు,
జిల్లా సహాయ కార్యదర్శి జమ్మూల.జితేందర్ రెడ్డి,
జిల్లా కార్యవర్గ సభ్యులు తాటి.వెంకటేశ్వర్లు,జిల్లా సమితి సభ్యులు చింతల.రమేష్ లు పార్టీ కండవ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, ఇచ్చిన హామీలను అమలు చేయాలని పార్టీ శ్రేణులు పోరాటాలని ఉదృతం చేయాలనీ ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాదెండ్ల.పుల్లయ్య మాట్లాడుతూ రాజకీయాల్లో ఎన్ని ఒత్తిడులు,ఒడిదుడుకులు, కష్టాలు వచ్చిన జీవితాంతం ఒక కమ్యూనిస్టుగా బ్రతకాలని కమ్యూనిస్ట్ పార్టీలలోనే పనిచేయాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు.రఘుంధపాలెం మండలంలో మహానుభావుడు రజబ్ అలీ గారి స్పూర్తితో సీపీఐ పార్టీని ఒక బలమైన పార్టీగా నిలబెట్టడం కోసం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కార్మిక కర్షక వ్యవసాయ కార్మికుల,ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతానని పార్టీ ఇచ్చే ప్రతి పిలుపులో ముందు ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో
విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికల రామకృష్ణ. ఇంద్రసేన తదితరులు పాల్గొన్నారు

2,807 Views

You may also like

Leave a Comment