Home Uncategorized ఏఐటియుసి పోరాట ఫలితంగానే ఎంపీహెచ్ఏ ఫిమేల్ రాత పరీక్షల ఫలితాలు విడుదల.

ఏఐటియుసి పోరాట ఫలితంగానే ఎంపీహెచ్ఏ ఫిమేల్ రాత పరీక్షల ఫలితాలు విడుదల.

by VRM Media
0 comments

ఎం హెచ్ ఎస్ ఆర్ బి బోర్డు కార్యదర్శికి కృతజ్ఞతలు.

కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర రెండవ ఏఎన్ఎంల సంఘం (ఏఐటియుసి) గౌరవ అధ్యక్షులు తోట రామాంజనేయులు.

ఏఐటియుసి పోరాట ఫలితంగానే మల్టీపర్పస్ హెల్త్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు తెలంగాణ రాష్ట్ర రెండవ ఏఎన్ఎంల సంఘం (ఏఐటియుసి) రాష్ట్ర గౌరవాధ్యక్షులు తోట రామాంజనేయులు తెలిపారు. సోమవారం పరీక్షా ఫలితాలు విడుదలైన సందర్భంగా ప్రభుత్వానికి, ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డ్ కార్యదర్శికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023వ సంవత్సరంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో రెండవ ఏఎన్ఎం లను బే షరతుగా రెగ్యులర్ చేయాలని నిరవధిక సమ్మె చేశామని ఆ సమ్మె కారణంగానే అప్పటి ప్రభుత్వం 1531 ఎం పి హెచ్ ఎ (ఎఫ్) పోస్టులను విడుదల చేసింది అన్నారు. ఏఐటీయూసీ పోరాట ఫలితంగా అదనంగా మరొక 400 పోస్టులు పెంచడంతోపాటు 53 సంవత్సరాల వరకు వయోపరిమితిని పెంచిందని ఆయన గుర్తు చేశారు. 30 మార్కులు వెయిటేజీ వచ్చిన కొన్ని యూనియన్ల కుట్రతో కోర్టు కేసు కారణంగా అవి 20 కి తగ్గిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ప్రొవిజినల్ లిస్టు ను విడుదల చేశారని వీలైనంత త్వరలో నియామకాలను పూర్తి చేసి రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. పరీక్ష రాసిన నాటి నుండి విడుదల అయ్యేవరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దాదాపు 22 సార్లు ఎంహెచ్ఎస్ఆర్పి బోర్డు , కమీషనర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించినట్లు ఆయన వివరించారు. పరీక్ష రాసిన తర్వాత కూడా ఉద్యోగం రాని రెండవ ఏఎన్ఎం లకు 100% గ్రాస్ శాలరీ తో పాటు పరీక్షకు అర్హత లేని రెండవ ఏఎన్ఎంలకు 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలన్నారు. యూనియన్ పిలుపుమేరకు అనేకసార్లు ధర్నాల్లో పాల్గొన్న సెకండ్ ఏఎన్ఎం లకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు . త్వరలో రెండవ ఏఎన్ఎంల రాష్ట్ర సమితి సమావేశం ఏర్పాటుచేసి భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని ఆయన తెలియజేశారు.

2,817 Views

You may also like

Leave a Comment