vrm media ప్రతినిధి ఖమ్మం



ఖమ్మం,15 మే :
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక, అధ్యక్షులు మామిడి సోమయ్య, దంపతుల 39 వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఖమ్మం జిల్లా కేంద్రం లో ఫెడరేషన్ యూనియన్ సభ్యులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, సభ్యులకు మిఠాయిలు పంచి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు నానబాల రామకృష్ణ, అర్వపల్లి నగేష్ మాట్లాడుతూ, మొదటగా టిడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపకులు మామిడి సోమయ్య దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మామిడి సోమయ్య టిడబ్ల్యూజెఎఫ్ (H-2843) యూనియన్ ని 2010 లో స్థాపించారు. ఆ నాటి నుండి యూనియన్ తో పాటు కుటుంబాన్ని కూడా సమతుల్యం చేస్తూ వారి పిల్లల ఉన్నత చదువులకు వెన్నంట ఉంటూ యూనియన్, కుటుంబం తన రెండు కళ్ళుగా భావించి ముందుకు నడిపిస్తున్నారు.ఖమ్మం జిల్లాతో పాటు గా తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల్లో కూడా యూనియన్ లో ఎటువంటి అవకతవకలు లేకుండా, నిష్పక్షపాతంగా, నిస్వార్ధగా ఎలాంటి పొరపాట్లు లేకుండా, యూనియన్ సభ్యులను తమ కుటుంబ సభ్యులుగా చూస్తూ ఎవరికి ఆపద వచ్చిన తన పదవి హోదా తగ్గట్టుగా ముందు నిలబడి సహాయం చేస్తూ యూనియన్ ముందుకు నడిపిస్తున్న సోమయ్య, దంపతులు ఇలాంటి పెళ్లి రోజులు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు.ఖమ్మం జిల్లా కమిటీ నుండి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజెఎఫ్ (H-2843), జిల్లా అధ్యక్షులు నానబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అర్వపల్లి నగేష్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ నల్లా రాకేష్ రెడ్డి, జిల్లా వీడియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు అమరబోయిన ఉపేందర్, టీబీజేఎ నగర అధ్యక్షులు ఎలుగోటి వెంకట్, సహాయ కార్యదర్శి చిన్నంశెట్టి రాంబాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్, కొండల్, పులిపాటి పాపారావు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.