VRM మీడియా అయినవిల్లి భద్రం
రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గుమ్ములూరు (జగన్నాధపురం) గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఎస్సీ సామాజికవర్గ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ సమక్షంలో వీరంతా జనసేన కండువా కప్పుకుని అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
జనసేన పార్టీలో చేరిన వారిలో గుమ్ములూరు గ్రామానికి చెందిన ముఖ్య నేతలు: కాటే కృష్ణ ప్రసాద్ , చిన్నం వెంకటరమణ దారా వెంకటేశ్వర్లు, గొర్రెల సుబ్బారావు కాతా పండురాజు , గుమ్మడి రవికుమార్ .. వీరికి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ..”జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు జనసేనలోకి రావడం శుభపరిణామం. గుమ్ములూరు గ్రామ అభివృద్ధికి, అలాగే నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా మా ప్రభుత్వం పనిచేస్తుందని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అందరం కలిసికట్టుగా నియోజకవర్గ ప్రగతికి శ్రమిద్దాం.”
పార్టీలో చేరిన వైసిపి నాయకులు మాట్లాడుతూ… ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నాయకత్వంలో రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ ముఖ్య నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
