Home ఎంటర్‌టెయిన్మెంట్ ముంబైలో చేతి బ్యాండేజ్‌తో కనిపించిన రామ్ చరణ్.. ఫ్యాన్స్‌లో టెన్షన్ – VRM MEDIA

ముంబైలో చేతి బ్యాండేజ్‌తో కనిపించిన రామ్ చరణ్.. ఫ్యాన్స్‌లో టెన్షన్ – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


ఎండలు తగ్గుముఖం పడుతున్నాయని అందరు అనుకుంటున్నారు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(రామ్ చరణ్)పెద్ది(పెద్ది)హీట్ ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలను తాకుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ చెప్తున్న మాటలకైతే ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఉక్కపోతకి చూస్తున్నారు. పెద్ది ఎలా ఉండబోతున్నాడనేదే టెన్షన్ నే ఆ ఉక్కపోతకి కారణం. రీసెంట్ గా ఇప్పుడు వాళ్ళందర్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్ టెన్షన్ కి గురి చేస్తుంది.

చరణ్ రీసెంట్ గా ముంబైలోని ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ హాకీమ్ ఆలిం సెలూన్‌కి వెళ్ళాడు. కొందరు అభిమానులు, ఫోటోగ్రాఫర్లు చరణ్ కుడి చేతికి ఉన్న బ్యాండేజ్ ని గమనించి ఫోటోలు తీశారు. ఈ విజువల్స్ నెట్టింట వైరల్ కావడంతో చరణ్ చేతికి ఏమైంది, షూటింగ్ సమయంలో ఏమైనా ప్రమాదం జరిగిందా అని అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు రామ్ చరణ్ కంటి పైభాగంలో గాయమై నాలుగు కుట్లు పడ్డాయి.ఇప్పుడు మళ్లీ చేతికి బ్యాండేజ్‌తో కనిపించేసరికి ఫ్యాన్స్ కంగారుపడ్డారు.

అయితే, ఈ తాజా చేతి గాయంపై చిత్ర యూనిట్ మరియు చరణ్ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అభిమానుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చరణ్ కుడి చేతి మణికట్టు వద్ద ఒక చిన్న మైల్డ్ స్ప్రెయిన్ స్వల్ప నలిగుడు లాంటి మితమైన నొప్పి మాత్రమే అయింది. ఇది పెద్ద ప్రమాదం ఏమీ కాదు. కేవలం ముందుజాగ్రత్త చర్యగా, ఆ నొప్పి మరింత ఎక్కువ కాకుండా ఉండటానికి మరియు వేగంగా కోలుకోవడానికి మాత్రమే డాక్టర్ల సలహా మేరకు ఈ సపోర్ట్ బ్యాండేజ్ ధరించినట్లు క్లారిటీ వచ్చింది. ఇక ఆ పిక్ లో టార్జాన్ లుక్ తో ఉన్న చరణ్ పిక్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ తెస్తుంది.

ఇది కూడా చదవండి: పర్శంటేజ్ సిస్టం నుంచి మినహాయింపు కోరిన 17 సినిమాలు

‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 18న ముంబై వేదికగా ట్రైలర్ ఈవెంట్ జరగనుంది. జూన్ 3న ప్రీమియర్ షోతో పాటు జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదలైంది.

2,801 Views

You may also like

Leave a Comment