- *ఖమ్మం ప్రతినిధి చిన్నంశెట్టి రాంబాబు
ఖానాపూరo హవేలీ
శాఖ సమావేశం లో
ఖమ్మం సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్
ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఖానాపురం హవేలీ శాఖ
సమావేశo నానబాల.రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి దండి సురేష్ పాల్గొని హవేలీ పరిధిలో ఉన్నటువంటి ఎన్ఎస్పీ కెనాల్ ప్రభుత్వ భూమి 66 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి భూమిలో పేదలు ఆనాడు గుడిసెలు వేసుకోగా వాటిని తొలగించి ప్రత్యామ్నాయంగా గుడిసెలు వేపించారు ప్రభుత్వం కానీ ఏదైతే కోట్ల విలువలు చేసే భూమున్నదో ఆ భూమిని ప్రజా అవసరాల నిమిత్తం ఉపయోగించకుండా నిర్మానుషంగా ఉండడం వలన
ఈ రోజున కార్పొరేట్ పెట్టుబడుదారులు అధికార పార్టీ కి చెందిన కార్పోరేటర్ మరియు అతని అన్న అందరూ కలిసి సుమారు 3 కోట్లు విలువ చేసే భూమిని దర్జాగా కబ్జా చేశారు దానిపై భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని విధాలుగా అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ పాలకులు అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం వలన వారు గతంలో కొన్ని షటర్స్ కట్టి మరియు ఇప్పుడు కొత్తగా కొంత భూమిని కబ్జా చేశారు మొత్తం కలిపి సుమారు 3 కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశారు దీనిపై కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినా, వారు కూడా స్పందించ లేదు, కాబట్టి ఈ నెల,జూన్ ఏడో తారీఖున(ఆదివారం) భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలైనటువంటి పేదలందరూ కూడా గుడిసెలు వేసుకోవడానికి పెద్ద ఎత్తున తరలిరావాలని వారు
పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఖానాపురం హవేలీ కార్యదర్శి ఏనుగు గాంధీ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

