Home Uncategorized తెలంగాణ ఉద్యమ కెరటంపొనుగోటి సంపత్

తెలంగాణ ఉద్యమ కెరటంపొనుగోటి సంపత్

by VRM Media
0 comments

ఉమ్మడి రాష్ట్ర పోలీసు వ్యవస్థను గడగడలాడించిన సంపత్

ప్రధమ ముద్దాయిగా కేసీఆర్ రెండో ముద్దాయిగా సంపత్

ఖమ్మం(01,సోమవారం ): అటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కానీ, ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆశయ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి మూడున్నర కోట్ల ప్రజల మన్నలను పొంది, తనదైన శైలిలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో తెలంగాణ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలు, దగా పడిన తెలంగాణ అనే ప్రధాన నినాదంతో ముందుకు తీసుకెళ్లి ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేసిన తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘాల రాష్ట్ర అధికార ప్రతినిధి పొనుగోటి సంపత్ పై తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం..!!

చిన్నతనంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలలో ఆంధ్ర పెత్తందారుల చేతిలో తీవ్ర అణిచివేతకు గురవుతున్నారని గమనించి, 2001వ సంవత్సరంలో కెసిఆర్ సారధ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఆనాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్ నేతృత్వంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా కొనసాగారు, తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయం అయిన జలదృశ్యంలో ఆనాటి మేధావి వర్గమైన ప్రొఫెసర్ జయశంకర్, కేశవరావు జాదవ్, బాలగోపాల్, హరగోపాల్, గాదె ఇన్నయ్య లాంటి వారి శిష్యరికంలో ఏ రంగాలలో తెలంగాణ మరింత అణిచి వేయబడుతుంది అని గ్రహించి, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంతో పాటు ప్రత్యేక రాష్ట్ర అవశ్యకతను వివరించే విధంగా “పల్లె బాట ” కార్యక్రమాన్ని రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల ప్రజలలో తెలంగాణ ఉద్యమ భావాన్ని పెంపొందించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో విజయవంతమైనందుకు గాను పొనుగోటి సంపత్ సేవలను కేసీఆర్ గుర్తించి, తెలంగాణలోని విద్యార్థులు రాజకీయాలకు ఉద్యమాలకు దూరంగా ఉంచాలానే దృఢ సంకల్పంతో ఉన్న కెసిఆర్, విద్యార్థి ఉద్యమాలతోనే క్షేత్రస్థాయిలో తెలంగాణ భావజాలాన్ని మరింత పెంపొందించొచ్చని సూచించడంతో, పలుమార్లు కేసీఆర్ పలువురు మేధావులతో సంపత్ ఇచ్చిన సూచనలు పరిగణంలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ఏర్పాటుకు నాంది పలికారు, అప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి సంఘం పేరుతో ఉద్యమాలు నిర్వహిస్తున్న తరుణంలో వారితో కూడా ప్రత్యేక చర్చలు జరిపి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంలో ఆ సంఘాలను కూడా విలీనం జరిగింది. 2002 లో ఆ యొక్క విద్యార్థి విభాగానికి రాష్ట్ర గౌరవ సెక్రెటరీగా నియమించడంతోపాటు ఆంధ్ర పెత్తందారులు, సమైక్య రాష్ట్ర వాదాన్ని గట్టిగా వినిపించే ఆంధ్ర రాష్ట్ర బోర్డర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగానికి జిల్లా అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఏకదాటిగా 12 సంవత్సరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా, అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పొనుగోటి సంపత్ తనకు ఉన్న నిబద్ధతతో క్షేత్రస్థాయిలో విద్యార్థి విభాగాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు విద్యార్థి ఉద్యమాన్ని కూడా బలోపేతం చేశారు, కాలక్రమేనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలి పునర్ధరణ కావడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో పట్టభద్రుల ఎన్నిక అనివార్యమైంది, ఆ సమయంలో విద్యార్థి ఉద్యమం, విద్యార్థి లోకాన్ని మమేకం చేసే సత్తా ఉన్న పొనుగోటి సంపత్ నీ పోటీ చేయాల్సిందిగా కెసిఆర్ సూచించగా, సున్నితంగా తిరస్కరించి ఆనాటి కెసిఆర్ కు వ్యక్తిగత కార్యదర్శిగా అంతకుముందు హోం మంత్రి మాధవరెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఐఎఫ్ఎస్ అధికారి కపిలవాయి దిలీప్ కుమార్ పేరును సూచించడంతో సరే అన్న కేసీఆర్ మూడు జిల్లాల శాసనమండలి పట్టభద్రులు ఎన్నికల ఇన్చార్జిగా పొనుగోటి సంపత్ నీ నియమించడం జరిగింది.

అప్పటికే పట్టభద్రులలో, విద్యార్థులలో, విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న పొనుగోటి సంపత్ మూడు జిల్లాల ఇన్చార్జిగా ఉండి కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి తెలంగాణ వాదాన్ని, పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలను మరింత క్షుణ్ణంగా వివరించి దేశ చరిత్రలోనే మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి పేరు మీద ఉన్న ఎమ్మెల్సీ మెజార్టీ రికార్డును బద్దలు కొట్టి కపిలవాయి దిలీప్ కుమార్ ని గెలిపించుకోవడం జరిగింది . అదే తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి గెలుపు కావడంతో అటు కేంద్ర ప్రభుత్వ దృష్టిలో తెలంగాణ వాదం ఏ తరహాలో ఉందో స్పష్టత కనిపించి జాతీయస్థాయి పార్టీల దృష్టిని తెలంగాణ వాదం వైపు మళ్లించడంలో పొనుగోటి సంపత్ సఫలీకృతమయ్యారు, రెండేళ్లు గడవకముందే మళ్లీ శాసన మండలి పట్టభద్రులు ఎన్నికలు రావడంతో అదే మూడు జిల్లాల నుండి కపిలవాయి దిలీప్ కుమార్ ని నిలబెట్టి రెండోసారి కూడా విజయ డంకా మోగించడం జరిగింది.

ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన ఉమ్మడి ఖమ్మం జిల్లా భారీ మెజార్టీ రావడం దానికి కారకుడైన పొనుగోటి సంపత్ సేవలను రాష్ట్ర రాజధానిలో అవసరం ఉందని గ్రహించిన కేసీఆర్ దక్షిణ భారతదేశంలో ఎందరో మహానుభావులు, ముఖ్యమంత్రి చంద్రబాబు, అజారుద్దీన్ స్పీకర్ సురేష్ రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఎందరో డీజీపీలు, ఎందరో ఐఏఎస్ లు, ఎందరినో రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ నిజాం కళాశాలలో విద్యనభ్యసించాలని కోరడంతో తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారి సహకారంతో నిజాం కళాశాలలో చేరి, చేరిన మొదటి సంవత్సరంలోనే ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం మాత్రమే కార్యక్రమాలు నిర్వహించే వెసులుబాటు ఉండేది, అలాంటి నిజాం కళాశాలలో చేరిన మొదటి సంవత్సరంలోనే విద్యార్థి నాయకుడిగా ఘనవిజయం సాధించి తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని రాష్ట్ర రాజధానిలో బలోపేతం చేసి, అటు అసెంబ్లీ ముట్టడిలో పార్టీ నిర్వహించే కార్యక్రమాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనడానికి ఎనలేని కృషి చేశారు, అధికార పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలు ఎన్నో ఒత్తుడులు, భౌతిక దాడులు, మానసిక క్షోభ గురిచేసి ఎన్నో కేసులు పెట్టినప్పటికీ నాయిని నరసింహారెడ్డి,తన్నీరు హరీష్ రావు ఎప్పటికప్పుడు మనోధైర్యం కల్పిస్తూ విద్యార్థి సంఘాన్ని పటిష్టపరిచారు. తదనంతరం అన్ని పార్టీల మద్దతుతోనే తెలంగాణ సాధ్యమవుతుంది అనే భావనలో ఉన్న కేసీఆర్ అన్ని పార్టీల మద్దతు కూడా కట్టి హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరామ్ ని నియమించడం జరిగింది.

తెలంగాణ జేఏసీ చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరాం ప్రమాణ స్వీకారం చేసిన రెండు నిమిషాలలోనే కెసిఆర్ ఆదేశానుసారం పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాంకు వ్యక్తిగత కార్యదర్శిగా పొనుగోటి సంపత్ ను నియమించారు, తెలంగాణ విద్యార్థి ఉద్యమంపై పూర్తి పట్టు ఉన్న సంపత్ కు ప్రొఫెసర్ కోదండరామ్ జేఏసీ చైర్మన్ కావడం, అంతకుముందు అతనికి విద్యాబుద్ధులు నేర్పిన గురువుగా వెనకడుగు వేయకుండా క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు కోదండరాం వెంబడి పల్లెల నుండి పట్టణాలలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని కృషి చేసి సఫలీకృతమయ్యారు. ఇదే క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆంధ్ర వలసవాదులు ఎక్కువగా ఉండడం ఉద్యమం మరింత తీవ్రంగా లేకపోవడంతో తిరిగి ఉమ్మడి ఖమ్మం జిల్లా పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చింది . ఇదే క్రమంలో అమరుల త్యాగ ఫలం కేసీఆర్ దీక్ష ఫలం తో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో ఆనాటి కెసిఆర్ ఆమరణ నిరాహారదీక్ష సమయంలో అక్రమ నిర్బంధానికి గురైన కేసీఆర్ ఖమ్మం జైలుకు తీసుకువచ్చిన విషయం అందరికీ విధితమే, ఖమ్మం కేసులో కేసీఆర్ ప్రధాన ముద్దాయి అయితే రెండవ ముద్దాయిగా పొనుగోటి సంపత్ నీ అరెస్టు చేయడం కాకుండా కెసిఆర్ తో పాటు జైల్లో ఉంచిన విషయం అందరికీ తెలిసింది, ఆ సమయంలో కేసీఆర్ పై కేసు పెట్టే విషయంలో డీజీపీ స్థాయి నుండి కింద స్థాయి సిబ్బంది వరకు 48 గంటల పాటు కేసు పై చర్చించారు అంత సుదీర్ఘ చర్చలు జరిగినప్పటికీ అప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరో తెలవక జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పొనుగోటి సంపత్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చడం పెద్ద విశేషం.

అక్కడి నుండి మొదలైన కేసుల పర్వం ఎన్నో వందల అక్రమ కేసులు ఎదుర్కొంటూ, రాష్ట్రంలోనే మొట్టమొదటి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కేస్, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది, కెసిఆర్ కేసుతో పాటు పొట్టి శ్రీరాముల విగ్రహ ధ్వంసం, లోక్ సత్తా పార్టీ కార్యాలయ ధ్వంసం, రాజశేఖర్ రెడ్డి తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం జిల్లాలో పూర్తిస్థాయిలో అడ్డగింపులు, సాగరాహరం, మిలియన్ మార్చ్ లాంటి మిలిటెంట్ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల దృష్టిలో పడడంతో కొన్ని రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లక తప్పలేదు. సంపత్ చేపట్టబోయే కార్యక్రమాలు విధ్వంసంతో కూడినవని గ్రహించిన ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ వర్గాలు 24 గంటలు మఫ్టీలో తన ఇంటి వద్ద, ఎక్కడికి వెళ్తే అక్కడికి తమ సిబ్బందితో నిఘా ఉంచేవారు, ఒకానొక సందర్భంలో అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఉద్యమ పందా మార్చుకొని ఎడల ఎన్కౌంటర్ చేస్తామని బెదిరింపులకు కూడా గురి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తిస్థాయి పట్టున్న పొనుగోటి సంపత్ కెసిఆర్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు న్యాయం జరగట్లేదని బహిరంగ విమర్శలు చేయగా, గ్రహించిన నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను పలుమార్లు తన నివాసానికి పంపించి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా కోరడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఉద్యమకారుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చే విధంగా తాజ్ కృష్ణ హోటల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భేటీలలో పలుమార్లు చర్చించడం జరిగింది, దాని ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాటు కాలయాపన చేసినప్పటికీ కేకే నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమకారుల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. ఇటీవల కాలంలో కేకే కమిటీ ఉద్యమకారుల సంక్షేమం కోసం రూపొందిస్తున్న నియమనిబంధనాల విషయాలలో కోదండరాంతో చర్చించి పలు సూచనలు చేయడం ఎవరిని ఏ పద్ధతిలో ఏ విధంగా ఆదుకోవాలనే విషయంపై పూర్తిస్థాయి పట్టుకున్న సంపత్ సూచనలు త్రూచ తప్పకుండా కేకే బృందం అమలు చేయబోతుంది.

2,802 Views

You may also like

Leave a Comment