ఖమ్మం ప్రతినిధి చిన్నంశెట్టి రాంబాబు
ఖమ్మం: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానిక ఖమ్మం రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది, కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన సల్వాది ఉపేంద్ర(20), తల్లితో కలిసి కొంతకాలంగా తల్లాడ మండలం మల్లవరం గ్రామంలో తన తాతయ్య ఇంట్లో నివసిస్తు ఖమ్మంలోని ఒ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్య నభ్యసిస్తున్నాడు , ఈ నేపద్యంలో ఈరోజు ఉదయం కళాశాలకు వెళ్ళోస్తానని తన తాతయ్యకు చెప్పి ఖమ్మం వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించి కుటుంబీకులకు కృతదేహాన్ని అప్పగించారు.ఈ ఘటనతో చిన్న కోరుకొండి గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.


