సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూన్ 16
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో, విద్యా, ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ నేతృత్వంలో, రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీ జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో సిద్ధవటం మండలం టక్కోలు గ్రామంలోని క్లస్టర్-1 పరిధిలో పోలింగ్ బూత్ నెం. 3 వద్ద ప్రత్యేక ఓటరు నమోదు SIR కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో బీఎల్ఓ శ్రీమతి పూర్ణిమ గారు కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు మరియు సవరణలకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేశారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునే యువత సమర్పించాల్సిన పత్రాలు, అర్హతలు మరియు దరఖాస్తు విధానంపై అవగాహన కల్పించారు. అదేవిధంగా, ప్రతి అర్హత కలిగిన యువకుడు, యువతి తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటు ఎంతో కీలకమని పార్లిమెంట్ ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి గారు ప్రజలకు సూచించారు. అవసరమైన ధృవీకరణ పత్రాలను బీఎల్ఓలకు సమర్పించి ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలొ చంద్ర ఓబుల్ రెడ్డి క్లస్టర్ శంకర్, ఆంజనేయులు పాల్గొన్నారు.

