VRM మీడియా అయినవిల్లి భద్రం
ఎం ఓ కే వెంకటేశ్వర్లు
కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల శనివారం పంపిణీ చేయవలసిన విత్తనాలు సోమవారం నాటికి వాయిదా వేయడం జరిగినది
ఆన్లైన్ లో పేర్లు నమోదు అయిన వారికి మాత్రమే విత్తనాలు పంపిణీ
దేవీపట్నం విశాలాంధ్ర జూన్ 27
29 తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు దేవీపట్నం మండలంలోని ఇందుకూరు , దేవీపట్నం 1, ఇందుకూరుపేట ,శరభవరం రైతు సేవా కేంద్రాల్లో గిరిజన రైతులకు 90% రాయితీపై వరి విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది అని మండల వ్యవసాయ అధికారి కె. వెంకటేశ్వర్లు తెలిపారు దేవీపట్నం మండలంలో వరి రకం ఎం టి యు 1318 అనే వరి రకం 772 క్వింటాళ్లు (8 రైతు సేవా కేంద్రం పరిధిలో ) సిద్ధంగా ఉంచడం జరిగినది. మండలంలోని వరి పండించే గిరిజన రైతులు వారి పట్టాదారు పాస్ బుక్ ,ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తో రైతు సేవ కేంద్రాల సందర్శించి బయోమెట్రిక్ విధానం ద్వారా ( డి క్రిష్ ద్వారా)విత్తనాలు తీసుకోవాల్సిందిగా తెలియజేశారు.
