- *ఖమ్మం ప్రతినిధి చిన్నంశెట్టి రాంబాబు
ఖమ్మం :- జిల్లాలోని తూనికలు-కొలతల శాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం కార్యాలయంలో 8 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక అటెండర్ ఒక ఇన్స్పెక్టర్ తో మాత్రమే మెట్టుకొస్తున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు. లీగల్ మెట్రాలజీ కార్యాలయంలో ఇన్స్పెక్టర్,డిప్యూటీ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్, మ్యాన్యువల్ అసిస్టెంట్లతో సహా 8 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ఒక ఇన్స్పెక్టర్, అటెండర్ మాత్రమే విధుల్లో ఉన్నారు. సిబ్బంది కొరత ఉండటంతో జిల్లావ్యాప్తంగా తూనికలు- కొలతల తనిఖీలు నిలిచిపోయాయని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో వ్యాపారులు తక్కువ తూకంతో వినియోగదారులను మోసం చేస్తున్నారని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కాబట్టి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వినియోగదారులకు న్యాయం జరిగే విధంగా సిబ్బంది నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
