VRM మీడియా అయినవిల్లి భద్రం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని
దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరియు ఎంపీడీవో కార్యాలయం నందు ఇందుకూరు గ్రామ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మరియూ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం జనసేనపార్టీ మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడు సభలను ఉద్దేశించి మాట్లాడుతూ.
ముందుగా జై భీమ్… జై భీమ్.జై భీమ్… అంటూ నినాదాలు పలికారు
డా.బి.ఆర్.అంబేద్కర్ కేవలం రాజ్యాంగ రచయితగా మాత్రమే కాకుండా, విద్యాభ్యాసంలోను, దళితుల సంక్షేమంలోను మరియు అన్ని పక్షాల హక్కులను పరిరక్షించడంలోనూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,గొప్ప రాజ్యాంగ నిర్మాత,అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అలాగే ఆయన అందించిన రిజర్వేషన్ ఫలాలు వల్లే ఈరోజు మనమందరం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. అలాంటి మహనీయులను ఎల్లప్పుడూ జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరికీ ఉంది అలాగే ఆయన అందించిన స్వేచ్ఛ ఫలాల ద్వారా మనందరం కలిసి స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సల్మాన్ రాజ్,టీడీపీ మండల అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు,బిజెపి మండల అధ్యక్షులు కారం రామన్న దొర,సొసైటీ అధ్యక్షులు మాగాపు బాబురావు,మాజీ మండల అధ్యక్షులు తైలం గంగాధర్, ముండ్రు మధుసూదన్ రావు,మరిశేట్ల వెంకటేశ్వరరావు,క్లస్టర్ ఇంచార్జ్ ముచ్చు వీర వెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు కీర్తి గంగరాజు, అయినాల వెంకటేశ్వర్లు,జనసేనపార్టీ నాయకులు ప్రధానకార్యదర్శి కొమరం దొరబాబు,కొండ్ల సురేష్ రెడ్డి,కొత్తపల్లి సతీష్,అయినవిల్లి భద్ర,రాజేష్, మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గాప్రసాద్ ,తెలుగుదేశం పార్టీ నాయకులు రేలంగి రాంబాబు,మట్ట నరసింహమూర్తి,మాజీ తెలుగు యువత కార్యదర్శి చవళం శివరామకృష్ణ,మాజీ సర్పంచ్ గౌరేశ్వరి,తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఈరేటి బ్రహ్మాజీ,సొసైటీ డైరెక్టర్ పల్లపాటి నాగేశ్వరరావు,మాజీ సర్పంచ్ కుంజం రాజమణి,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జొన్నల రాంబాబు,విద్యా కమిటీ అధ్యక్షులు సామరెడ్డి రామకృష్ణ, గ్రామ కమిటీ అధ్యక్షులు పోతుల వాసు రాచ శ్రీనివాస్,మన్నేపల్లి కనకం,మండల ప్రచార కార్యదర్శి పేరుగాని ఏసు, మండల వైస్ ఉపాధ్యక్షులు మిర్తివాడ వీరబాబు,తెలుగు యువత ఉపాధ్యక్షులు వంశీ,పంచాయతీ కార్యదర్శి శివ,కూటమి నాయకుడు సచివాలయ సిబ్బంది భారీ ఎత్తులో పాల్గొన్నారు.
