VRM మీడియా అయినవిల్లి భద్రం ఆలయం అభివృద్ధికి లక్ష 4,500 రూపాయలు విరాళం
తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం రూరల్ మండలం రాయుడుపాకల గ్రామంలోని కామాక్షి చంద్రమౌళీశ్వర స్వామి వారి( శివాలయం) విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా బుధవారం నిర్వహించిన, హోమం, పూజ కార్యక్రమానికి
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
తొలిత ఆయనకు కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి, పూలమాలలు, దుస్సాలువతో సత్కరించారు.
ఆలయ నిర్మాణపనులను పరిశీలించి, ఈ సందర్భంగా నిర్వహిస్తున్న హోమాలు, పూజ కార్యక్రమాలను సందర్శించి దర్శించుకున్నారు.
ఆలయ నిర్మాణానికి కంబాల శ్రీనివాసరావు లక్ష 4,500 రూపాయలు విరాళం అందించారు.
ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.