పోటీతత్వానికి ప్రోత్సాహం
బోనకల్, మే 01 :


బోనకల్ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను శాలువాలు, ప్రశంసా పత్రాలతో సత్కరించి నగదు బహుమతులు అందజేశారు.సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసు నుంచే లక్ష్యాన్ని ఏర్పరుచుకుని కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడం, వారిని మరింత ఉత్సాహపరచడం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎల్లప్పుడూ సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కోణతాలపల్లి పార్ధ సాయి అన్వేష్, చవట వెంకటరమణ కౌశిక్, సుగ్గల కీర్తన శ్రీ అన్షితలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంఘం మండల నాయకులు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.