Home Uncategorized టక్కోలి ఎస్టీ కాలనీలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

టక్కోలి ఎస్టీ కాలనీలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ మే 18

రాజంపేట నియోజకవర్గంలోని సిద్దవటం మండలం టక్కోలి ఎస్టీ కాలనీ వాసులు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి మార్గదర్శకత్వంలో, రాజంపేట ఇంచార్జ్ జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో టక్కోలి ఎస్టీ కాలనీ వాసులకు కొత్త నీటి మోటార్ ఏర్పాటు చేయబడింది.ఈ సందర్భంగా పార్లమెంట్ ఉపాధ్యక్షులు మగముని రెడ్డి గారు స్పెషల్ ఆఫీసర్స్ mro తిరుమల బాబు గారి చేతుల మీదుగా కొత్త మోటార్‌ను టెంకాయ కొట్టి ప్రారంబింపజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, vro రజని అలాగే పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, వీఆర్ఓ రాజనీ మరియు నాయకులు జగన్ మోహన్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, శంకర్, శివ, సుబ్బారాయుడు హాజరయ్యారు.

2,802 Views

You may also like

Leave a Comment