10 వేలు విరాళం అందించిన పార్లమెంట్ ఉపాధ్యక్షులు
సిద్ధవటం, VRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ మే 26
అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహానాడుకు పసుపు దండు కదిలి రావాలని టిడిపి మండల అధ్యక్షులు రాజశేఖర్ , క్లస్టర్ ఇంచార్జ్ దారపునెని రాజనాయుడు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగ మునిరెడ్డి పసుపు సైన్యానికి పిలుపునిచ్చారు సమిష్టి కృషితో కార్యకర్తలు ఏకతాటిపై కొచ్చి మహానాడు ను విజయవంతం చేయాలని తెలిపారు మండల కేంద్రమైన గ్రామ శివారులోని ఉషా గార్డెన్ లో మంగళవారం వారు మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చమ్మర్థి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో బుధ, గురువారం జరగబోయే మహానాడు కార్యక్రమం ఉషా గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నామని మహానాడు కార్యక్రమానికి 10 వేలు విరాళం పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగ ముని రెడ్డి అందించారని టిడిపి మండల అధ్యక్షులు రాజశేఖర్ క్లస్టర్ ఇంచార్జ్ రాజా నాయుడు పేర్కొన్నారు పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త మహానాడు కార్యక్రమానికి కదిలి రావాలని పార్టీ కార్యకర్తలే పార్టీకి మూల స్తంభం అని ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకొని సమిష్టి కృషితో జరగబోయే రెండు రోజులు మహానాడు ను విజయవంతం చేద్దామని మహానాడుకు వచ్చిన కార్యకర్తలకు భోజనం వసతి ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రాజశేఖర్, క్లస్టర్ ఇంచార్జ్ దారపునేని రాజనాయుడు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగ మునిరెడ్డి, టిడిపి సీనియర్ నేత వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ప్రతినిధి పార్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

