*కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఓ దాబాలో నిత్యం బహిరంగ మధ్యపానం * – నల్లగా కాగిన నూనెతో వంటలుప్రజల ప్రాణాలతో చెలగాటం*
ఖమ్మం కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో, వైరా ప్రధాన రహదారిపై ఉన్న ఒక దాబాలో నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా మద్యం సేవించడమే కాకుండా, తీవ్ర అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తూ కస్టమర్ల ప్రాణాలతో యాజమాన్యం చెలగాటమాడుతోంది. దాబాలో బయటపడ్డ అక్రమాలు:
*బహిరంగంగా మద్యం సేవించడం *: దాబాకు ఎటువంటి బార్ లైసెన్స్ లేకున్నా, యథేచ్ఛగా మద్యం తాగడానికి అనుమతిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దాబా మందుబాబుల అడ్డాగా మారుతోంది. పక్కనే కూర్చుని భోజనం చేసే కుటుంబాలు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. కాగి కాగి వున్న నల్లటి నూనెతో చికెన్ 65, ఫిష్ ఫ్రై, కర్రీ పాయింట్ ఐటమ్స్ అన్నీ వారాల తరబడి మార్చని, నల్లగా మాడిపోయిన నూనెలోనే వేయిస్తున్నారు. నురగలు, పొగతో ఉన్న ఆ నూనె వాడకం వల్ల క్యాన్సర్, లివర్ సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అపరిశుభ్రమైన వంటగది మొత్తం జిడ్డు, బూజు పట్టి ఉంది. కుళ్లిన కూరగాయలు, చెత్త అక్కడే పడేస్తున్నారు. పాత్రలు సరిగా కడగడం లేదు. వంటవాళ్లు చేతులకు గ్లోవ్స్, తలకు క్యాప్ లేకుండానే వంట చేస్తున్నారు. ఈగలు, దోమల మధ్యే కస్టమర్లకు వడ్డన జరుగుతోంది. తాగిన వారు బహిరంగంగానే రోడ్డుపై మూత్ర విసర్జన చేస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. అంతేకాకుండా అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలకు, ఘర్షణలకు అడ్డాగా మారటం, చుట్టూ నిర్మానుష్య స్థలాలు ఉండటం ప్రజారక్షణకు ప్రశ్నార్ధకంగా మారుతుంది. నిల్వ ఆహారం*: ఫ్రిజ్‌లు సరిగా పనిచేయకపోవడంతో చికెన్, పాడైపోయి వాసన వస్తోంది. అదే మాంసాన్ని మసాలాలు దట్టించి వండి పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. *ప్రజల ఆగ్రహం:* “కలెక్టర్ ఆఫీస్ కు కూతవేటు దూరంలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎక్సైజ్, పోలీస్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నట్లు? రాత్రి 10 దాటితే ఫ్యామిలీతో ఈ రోడ్డులో వెళ్లాలంటేనే భయం. తాగి గొడవలు, బూతులు. పైగా కుళ్లిన తిండి తిని ఆసుపత్రి పాలవుతున్నాం” అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం: కలెక్టరేట్‌కు 500 మీటర్ల దూరంలోనే ఈ అక్రమ దందా నడుస్తున్నా ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ విభాగాలు చర్యలు తీసుకోవడం లేదు. ఎక్సైజ్ శాఖ వెంటనే దాడి చేసి అక్రమంగ మద్యం సేవించే వారిపై, యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులు నూనె, ఆహార శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపాలి. నిబంధనలు పాటించని దాబాను తక్షణమే సీజ్ చేయాలి.అదేవిదంగా జిల్లా వ్యాప్తంగా హైవే పక్కన ఉన్న దాబాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. లైసెన్స్ లేకుండా మద్యం అమ్మే దాబా యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. : జిల్లా పాలన కేంద్రం పక్కనే ప్రజారోగ్యంతో, శాంతిభద్రతలతో చెలగాటమాడుతున్నా చర్యలు లేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ దాబా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.