Home Uncategorized ఇందుకూరు పంచాయతీ ట్రాక్టర్లు ఎక్కడ? ప్రజాధనం లెక్క తేల్చాలని గ్రామస్థుల డిమాండ్

ఇందుకూరు పంచాయతీ ట్రాక్టర్లు ఎక్కడ? ప్రజాధనం లెక్క తేల్చాలని గ్రామస్థుల డిమాండ్

by VRM Media
0 comments

VRM మీడియా అయినవిల్లి భద్రం

*పోలవరం, * ఇందుకూరు గ్రామ పంచాయతీకి ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్లు ఎప్పుడు వచ్చాయి? ఇన్నాళ్లూ ఎవరు వాడుకున్నారు? ఎక్కడ పని చేశాయి? అనేది మిస్టరీగా మారింది.

రికార్డుల్లో ఉన్నాయి, గ్రామంలో లేవు:
స్వచ్ఛ భారత్, పారిశుద్ధ్య పనుల నిమిత్తం లో ఇందుకూరు పంచాయతీకి ఒక ట్రాక్టర్ రావడం జరిగింది. ప్రభుత్వ నిధులు దాదాప లక్షలతో కొనుగోలు చేసిన ఆ ట్రాక్టర్లు పంచాయతీ కార్యాలయం ముఖం కూడా చూడలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

“ట్రాక్టర్లు వచ్చాయని బిల్లులు పాస్ అయ్యాయి. కానీ మా ఊరిలో చెత్త ఎత్తడానికి ఇప్పటికీ రిక్షా బండ్లు లలో చెత్తను తీసుకెళ్తున్నారు. మరి మన ట్రాక్టర్లు ఏమయ్యాయి?”

లాగ్ బుక్ :
ట్రాక్టర్లకు సంబంధించిన లాగ్ బుక్, డీజిల్ వాడకం, డ్రైవర్ల హాజరు వివరాలు అడగ్గ పంచాయతీ కార్యదర్శి నుంచి సమాధానం లేదు.

బినామీల పేరుతో దందా?
“పంచాయతీ ట్రాక్టర్లను కొందరు నాయకులు సొంతపనులకు వాడుకున్నారు అని స్థానికులు ఆరోపణ చేస్తున్నారు. డీజిల్, మెయింటెనెన్స్ మాత్రం పంచాయతీ సొమ్ముతోనే” అని గ్రామ యువత ఆరోపిస్తోంది.

గ్రామసభలో నిలదీత:
ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని ప్రజల సొమ్ముతో కొన్న ట్రాక్టర్లు ప్రజలేకే ఉపయోగపడకపోతే ఎందుకు?” అని మండిపడ్డారు.

ప్రజల డిమాండ్లు:

  1. ట్రాక్టర్ల కొనుగోలు తేదీ, ఇంజన్-చాసిస్ నంబర్లతో సహా వివరాలు బహిర్గతం చేయాలి.
  2. గత నెలలుగా ట్రాక్టర్లు ఎక్కడ పని చేశాయో జీపీఎస్ డేటాతో నిరూపించాలి.
  3. ప్రైవేట్ అవసరాలకు వాడి ఉంటే ఆ మొత్తం + జరిమానా వసూలు చేయాలి.
  4. జిల్లా కలెక్టర్ స్వయంగా విచారణకు ఆదేశించి, బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలి
2,802 Views

You may also like

Leave a Comment