VRM మీడియా అయినవిల్లి భద్రం
పోలవరం జిల్లా రంపచోడవరంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో బీజేపీ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం జిల్లా నూతన బీజేపీ అధ్యక్షుడు వీక బుల్లికొండలు దొర అధ్యక్షత వహించగా, ఉత్తరాంధ్ర జోనల్ ఇన్‌చార్జ్ మట్టా ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మట్టా ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటాలని, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రభావవంతమైన వ్యక్తులతో మోదీ ప్రభుత్వ పాలనపై చర్చలు నిర్వహించడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యంపై విస్తృత ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి స్వప్నకుమారి గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాయం వెంకయ్య , గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి కారం సీతారామన్నదొర (డిల్లీ బాబు) , మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి కుంజం సత్యనారాయణమ్మ , జిల్లా కార్యదర్శులు గురుప్రసాద్ భారతి, కామేశ్వరి పిరమయ్య , సీనియర్ నాయకుడు నోముల రామారావు , మాజీ ఎమ్మెల్యే కోసూరి సత్యనారాయణ రెడ్డి వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

