Home Uncategorized రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన నరసాపురం యువకుడు నొక్కి రాజువర్మ మృతి పట్ల ఎమ్మెల్యే బత్తుల తీవ్ర దిగ్బ్రాంతి, పరామర్శ..

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన నరసాపురం యువకుడు నొక్కి రాజువర్మ మృతి పట్ల ఎమ్మెల్యే బత్తుల తీవ్ర దిగ్బ్రాంతి, పరామర్శ..

by VRM Media
0 comments

VRM media అయినవిల్లి భద్రం

మృతుని కుటుంబానికి అన్ని విధాల పూర్తి సహాయ సహకారాలు అందజేస్తాం..ఆదుకుంటాం, కుటుంబ సభ్యులకు “బత్తుల” హామీ..

ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని, బాధితు కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశం…

కుటుంబ సభ్యులకు, సహచర మిత్రులకు ఈ కష్టకాలంలో మనోధైర్యంతో ఉండాలని విన్నపం

రాజమండ్రి గవర్నమెంట్ హాస్పటల్ వద్ద మృతదేహాన్ని సందర్శించి సంబంధిత అధికారులతో మాట్లాడి, మిగిలిన కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం…

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, నరసాపురం గ్రామానికి చెందిన నొక్కి రాజువర్మ అనే వ్యక్తి నిన్నటి7 రోజున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పటల్ వద్ద మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులకు, మిత్రులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసి మనోధైర్యంతో ఉండాలని చెప్పారు, అలానే మృతుని కుటుంబానికి జనసేన పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుని, మృతుని కుటుంబ సభ్యులకు,, పిల్లలకు భవిష్యత్తుపై పూర్తి భరోసాని ఇచ్చారు, మృతుని బంధువులను, మృతుని మిత్రులను ఓదార్చి అత్యంత బాధాకరమైన ఈ సందర్భంలో ఆ భగవంతుడు ఈ కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నారు..

2,805 Views

You may also like

Leave a Comment