Home Uncategorized VRM media అయినవిల్లి భద్రం తేది;26-04-2026, ఆదివారం

VRM media అయినవిల్లి భద్రం తేది;26-04-2026, ఆదివారం

by VRM Media
0 comments

ప్రజాస్వామ్య విలువలు పరిరక్షణ పత్రికావ్యవస్థతో నే సాధ్యం

పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వం దృష్టిలో పెడతాను

👉రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి*

ప్రజాస్వామ్యంలో పారదర్శక పాలన పరిరక్షణ బాధ్యత పాత్రికేయ సమాజంతోనే సాధ్యమని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. రంప చోడవరం ఆర్ పి ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా జర్నలిస్టుల తొలి మహాసభను జిల్లా నాయకత్వం అధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమెకు పాత్రికేయ యూనియన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సభలో తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సమాజంలో ప్రజా సమస్యల పరిష్కార వారధిగా ఉండే బాధ్యతాయుతమైన నిర్వహణ చేసే వ్యవస్థే పాత్రికేయ రంగం అన్నారు. ఒక వైపు ప్రజా సమస్యల కోసం మరో వైపు ప్రభుత్వ శాఖల కార్యనిర్వహణ పై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సక్రమంగా పరిపాలన సాగించేందుకు దోహద పడే కోణంలో విలేఖరులు పాత్ర అత్యంత కీలకమన్నారు. మెరుగైన సమాజం కోసం పాటుపడే పాత్రికేయుల సమస్యలు సైతం మన్యంలో అనేకం అన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం సంబధిత ఉన్నతాధికారుల తోనూ, ప్రభుత్వం దృష్టిలో పెట్టి న్యాయం చేయడానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు. యూనియన్ సభ్యులు ఆమెను దుస్సాలువాతో సత్కరించి మెమెంటో బహుకరించారు.
కార్యక్రమంలో రంప చోడవరం మాజీ సర్పంచ్ వై.నిరంజనీ దేవి , తెదేపా సీనియర్ నాయకులు గణజాల తాతారావు, అనూప్ ఒకేషనల్ కళాశాల చైర్మన్ చీకట్ల ఆశీర్వాదం, గిరిజన సంఘం నాయకులు లోత రామారావు, పాత్రికేయ యూనియన్ నాయకులు చోడిశెట్టి సుబ్బారావు, రామరాజు, శివ, కేశవరపు చంద్ర శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దంగేటి సత్తిబాబు, జనసేన మహిళా విభాగ నాయకులు పాతర సీతామహాలక్ష్మి, తెదేపా మాజీ మండల పార్టీ అధ్యక్షులు కారం సురేష్ బాబు, అధిక సంఖ్యలో పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

2,807 Views

You may also like

Leave a Comment