Home Uncategorized కట్టెకోలను సన్మానించిన రామదాసు సాహితీ సంస్థనరసయ్యను అభినందించిన ప్రముఖ సాహితీవేత్తలు

కట్టెకోలను సన్మానించిన రామదాసు సాహితీ సంస్థనరసయ్యను అభినందించిన ప్రముఖ సాహితీవేత్తలు

by VRM Media
0 comments

ఖమ్మం, నీలగిరి వార్త, ఏప్రిల్ 25: ప్రముఖ కవి సీనియర్ జర్నలిస్ట్ కట్టెకోల చిన నరసయ్యను రామదాసు సాహితీ కళా సేవా సంస్థ, విశ్వవిఖ్యాత సాహిత్య సామాజిక సేవా సంస్థలు ఘనంగా సత్కరించాయి. రామదాసు సాహితీ కళా సేవా సంస్థ మూడవ వార్షికోత్సవాన్ని హైదరాబాదులోని కూకట్పల్లి భారత్ వికాస్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం ఆవరణలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన హాజరైన కవులు కవయిత్రులతో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కవి సమ్మేళనంలో కట్టెకోల యుద్ధాల విధ్వంసాలు అనే శీర్షికన రాసిన కవితను ఆలపించారు. అనంతరం రామదాసు సాహిత్య సాహితీ కళా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామదూత, విశ్వవిఖ్యాత సాహిత్య సామాజిక సేవా సంస్థ అధ్యక్షులు భీమా, ముఖ్య అతిథి గంటా మనోహర్ రెడ్డి, కుసుమ ధర్మన్న కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాధాకుసుమ, కళానిధి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ప్రపంచ ఫాసిస్టు పియోనిక్ డైరెక్టర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్టర్ ఆచార్య ఈ గౌరీ శంకర్ ప్రముఖ కవి ఆధ్యాత్మికవేత్త ఆచార్య మసన చెన్నప్ప, మోటూరి నారాయణరావు తదితరులు నరసయ్యకు శాలువా కప్పి ప్రశంస పత్రాన్ని మెమొంటోను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కట్టెకోలను వారు అభినందించారు

2,807 Views

You may also like

Leave a Comment