టీడీపీ మహానాడు విజయవంతం కావాలని విరాళం అందజేసిన అండ్లూరి వెంకటలక్ష్మమ్మ
సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ మే 25
సిద్ధవటం మండలం టక్కోలి గ్రామానికి చెందిన వృద్దురాలు అండ్లూరి వెంకటలక్ష్మమ్మ ఈ నెలలో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం విజయవంతంగా, ఘనంగా జరగాలని ఆకాంక్షిస్తూ రూ.1,116 విరాళంగా పార్లిమెంట్ ఉపాధ్యక్షులు అండ్లురి నాగముని రెడ్డి, చిన్నపరెడ్డి సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీ పార్టీ మరెన్నో మహానాడులను విజయవంతంగా నిర్వహిస్తూ ప్రజాసేవలో ముందుండాలని, పార్టీ ఎల్లప్పుడూ అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు.ఈ విరాళం అందజేసిన కార్యక్రమంలో క్లస్టర్ నాయకులు రాజానాయుడు ,మండల అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్ , గంగా నంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
