Home Uncategorized గ్రామీణ వైద్యుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ శివ కుమార్..హర్షం తెలిపిన కొమరా…

గ్రామీణ వైద్యుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ శివ కుమార్..హర్షం తెలిపిన కొమరా…

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట

డాక్టర్ బి సి రాయ్ గ్రామీణ వైద్యుల రాష్ట్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒంటిమిట్టకు చెందిన డాక్టర్ జి .శివకుమార్ ఎంపిక కావడం పట్ల రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఒంటిమిట్ట మండల టిడిపి సీనియర్ నాయకుడు కొమరా వెంకట నరసయ్య తమ హర్షం తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఒంటిమిట్ట మండల టిడిపి సీనియర్ నాయకుడైన డాక్టర్ జి శివకుమార్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనూ తదుపరి ఆంధ్ర ప్రదేశ్ లోనూ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యుల న్యాయమైన సమస్యల పరిష్కారం పట్ల ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇటు నూతన ఆంధ్ర రాష్ట్రంలోనూ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే విషయంలో తమ స్థాయిలో విశేష కృషి చేయడం జరిగిందని వెంకట నరసయ్య అన్నారు. గ్రామీణ వైద్యుల న్యాయమైన కోర్కెల సాధన కోసం అనేక మార్లు చేపట్టిన అనేక కార్యక్రమాల్లో డాక్టర్ శివకుమార్ ప్రత్యేక భూమిక నిర్వహించారని తెలిపారు. వైద్య పరంగా జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తాను తెలుసుకున్న విషయాలను గ్రామీణ వైద్యులకు చేరవేయడంలో డాక్టర్ శివ ఎప్పటికప్పుడు ముందు వరుసలో ఉంటున్నారని కొమరా ప్రసించించారు. ఏ రోగానికి ఎక్కడ మంచి వైద్యం లభిస్తుందో డాక్టర్ శివకుమార్ క్షుణ్ణంగా తెలుసుకొని ప్రజలకు ఉచిత సలహాలు ఇవ్వడంలో ముందంజలో ఉన్నారని వెంకట నరసయ్య ప్రశంసించారు. రాష్ట్రస్థాయిలో డాక్టర్ శివకుమార్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఈ సేవలపట్ల ముఖ్యంగా కడప జిల్లాలో పనిచేస్తున్న గ్రామీణ వైద్యులలో ఒక స్థానం డాక్టర్ శివ కుమార్ నిలుపుకున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర గ్రామీణ వైద్యుల ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన డాక్టర్ శివకుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా డాక్టర్ శివకుమార్ తమ సేవలు అందిస్తారని , కొమరా ఆశ భవాని వ్యక్తం చేశారు.

2,802 Views

You may also like

Leave a Comment