Home Uncategorized సీనియర్ జర్నలిస్ట్ కూరాకుల గోపి మృతి పట్ల డబ్ల్యూజేఐ దిగ్బ్రాంతి

సీనియర్ జర్నలిస్ట్ కూరాకుల గోపి మృతి పట్ల డబ్ల్యూజేఐ దిగ్బ్రాంతి

by VRM Media
0 comments

vrm media ప్రతినిధి రాంబాబు ఖమ్మం

ఖమ్మం: సీనియర్ జర్నలిస్ట్, జనంసాక్షి దిన పత్రిక ఖమ్మం జిల్లా బ్యూరో ఇంఛార్జి కూరకుల గోపీ ఆకస్మికంగా మృతి చెందడం పట్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆప్ ఇండియా (డబ్ల్యూజేఐ) ఖమ్మం జిల్లా కమిటి తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. ఈ మేరకు యూనియన్ రాష్ట కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు, జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్, జిల్లా కోకన్వీనర్లు యెన్నబోయిన శ్రీనివాస రావు, ఎం.ఏ అన్సార్ పాషా, ఎన్. రామకృష్ణ, నాగరాజు దేవర, అమరనేని రామకృష్ణ, ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గ కన్వీనర్ కె. కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు కట్టేకోల చిన నరసయ్య, జాబిశెట్టి కుటుంబ రావు, మోడెపల్లి కిరణ్, గోగుల నారాయణ రావు, కె. ప్రసాద రావు, పోటు శ్రీనివాస్, బొడ్డుపల్లి రవీందర్ తదితరులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గోపి మృతికి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. గోపి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.

2,807 Views

You may also like

Leave a Comment