VRM మీడియా న్యూస్
సత్తుపల్లి ప్రతినిధి | ఖమ్మం జిల్లా
26-06-2026 | పెనుబల్లి మండలం | మండాలపాడు గ్రామ పంచాయతీ
మండాలపాడు గ్రామ పంచాయతీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (SIR) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గాయం రమేష్ BLOలతో కలిసి ఓటర్లకు SIR ఫారమ్‌లను పంపిణీ చేశారు.
సర్పంచ్ గాయం రమేష్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో సక్రమంగా నమోదు అయ్యేలా ప్రభుత్వం ఈ సర్వే చేపట్టిందని, ప్రజలు తమ వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని కోరారు.
పంచాయతీ సెక్రటరీ & BLO ఆఫీసర్ టి. నాగేంద్ర బాబు మాట్లాడుతూ, ఫారమ్‌ల నింపడంలో సందేహాలుంటే BLOలను సంప్రదించాలని, ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఓటర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
